మంగళవారం వార్తల్లోని షేర్లు
By Sakshi

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సౌతిండియా బ్యాంక్:- బాసెల్-3 నిబంధనలకు అనుగుణమైన టైర్-2 బాండ్ల జారీ ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలని బోర్డు నిర్ణయించింది.
గ్లోబల్ స్పిరిట్స్:- బీహార్ యూనిట్‌ను పునరుద్ధరించి వాణిజ్య ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది.
టీవీ టుడే నెట్వర్క్స్:- తన అనుబంధ సంస్థ ఇండియా టుడే ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ రూ.69 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.
ఇన్ఫీబీమ్ అవెన్యూస్:- సింటెక్స్ బీఏపీఎల్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో సింటెక్స్ కంపెనీకి ఆన్లైన్ వ్యవహారాలను ఇన్ఫీభీమ్ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఐఎఫ్సీఐ:- తన అనుబంధ సంస్థ ఐఎఫ్సీఐ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ కంపెనీ విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
టాటా గ్లోబల్ బేవరీజెస్:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సౌకర్యంపై రేటింగ్ ఇక్రా... రేటింగ్‌ను సవరించింది.
ఎన్టీపీసీ:- న్యూడిల్లీలోని బదర్పూర్ థర్మెల్ పవర్ స్టేషన్లో నిర్వహణ కార్యకలాపాలను నిలివేస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విద్యుత్ సామర్థ్యం 75మెగావాట్లు.
కాక్స్&బుల్స్:- షేరు విభజనకు రికార్డు తేదిగా అక్టోబర్ 26ని నిర్ణయించింది.
క్వాలిటీ:- రూ.1200 కోట్ల రుణ చెల్లింపులో విఫలమైన కేసులో ఎన్సీఎల్టీ నోటీసులు జారీ చేసింది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, క్రిసెల్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్, శక్తి పంప్స్, జమ్మూ&కాశ్మీర్ బ్యాంక్, మహీంద్రా సీఐఈ
You may be interested
జడ్చర్లలో డీఎస్ఎం న్యూట్రిషన్ ప్లాంటు
Tuesday 16th October 2018జడ్చర్ల: జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్ఎం సంస్థ... మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో తన ప్లాంటును ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ... తన రెండో ప్లాంటును జడ్చర్లలో సోమవారం ఆరంభించింది. ఈ సందర్భంగా డీఎస్ఎం న్యూట్రీషియనల్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ డేవిడ్ బ్లాకెమోర్ మాట్లాడుతూ... యానిమల్ న్యూట్రిషన్‌కు సంబంధించి భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో
రూపీ డౌన్..
Tuesday 16th October 2018ఇండియన్ రూపాయి మంగళవారం కూడా స్వల్పంగా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.89 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు 73.82తో పోలిస్తే 0.1 శాతం నష్టపోయింది. రూపాయి మంగళవారం 73.77 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.945 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు 7.923 శాతంగా ఉంది.