STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th September 2018
Markets_main1536293304.png-20030

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇన్ఫోసిస్:- సింగపూర్‌ హోల్డింగ్‌ సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనుంది.
ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌:- బెంగళూర్‌ కంపెనీ గ్రాఫెన్‌ సెమికండక్టర్‌లో 100శాతం వాటాను రూ.93 కోట్లకు కొనుగోలు చేసింది.
యస్‌ బ్యాంకు:- నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 11న మూలధన సమీకరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో డిబెంచర్ల జారీ ద్వారా నిధులను సమీకరించేందుకు కమిటీ యోచిస్తోంది.
వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌:- అమెరికాలో గ్యాస్‌&ప్రాజెక్ట్‌ కొరకు 220కేఎంటీ పైపుల సరఫరాకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
విజయా బ్యాంక్‌:- సెప్టెంబర్‌ 7నుంచి సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు అమల్లోకి రానున్నాయి.
రిలయన్స్‌ నావెల్‌:- రుణాన్ని చెల్లించడంలో విఫలమైనందున ఐడీబీఐ బ్యాంకు దివాళాసృ‍్మతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎల్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేసింది.
బజాజ్‌ అటో:- క్వాడ్రిసైకిల్‌, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్ రప్రభుత్వం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్‌ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అపోలో హాస్పిటల్స్‌:- ఇద్దరు స్వతంత్ర్య డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు స్టాక్‌ ఎ​క్స్చ్‌ంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
శంకర్‌ బిల్డింగ్స్‌ ప్రోడెక్ట్స్‌:- రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ కంపెనీ రేటింగ్‌ను ఎ స్థిరత్వానికి పెంచింది.
గుఫిక్‌ బయో సైన్సెస్‌:- తన అనుబంధ సంస్థ గుఫిక్‌ బయోఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను విలీనం చేసుకునేందకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
బ్లూ స్టార్‌:- జపాన్‌ పోర్ట్‌పోలియో సంస్థ ‘‘టీ రోవ్’’తో సెప్టెంబర్‌ 7న సమావేశం కానుంది.
అజ్మీరా రియల్టీ&ఇన్ఫ్రా ఇండియా:- అనిర్దేష్‌ డెవలప్‌మెంట్‌లో 85శాతం వాటాను కొనుగోలు చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ:- కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 5.1శాతం వాటాను రూ.169.52 కోట్లకు మారిషన్‌కు చెందిన గ్రేట్‌ టెర్రియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీకు విక్రయించింది.
మాగ్మా ఫిన్‌కార్పోరేషన్‌:- గోల్డ్‌మాన్‌ శాచ్స్‌తో నేడు(సెప్టెంబర్‌ 7న) సమావేశాన్ని నిర్వహించనుంది.
షేర్‌ ఇండియా సెక్యూరిటీస్‌:- షేర్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్స్‌లో 10లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది.
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు:- రూ.665 కోట్ల విలువైన బాండ్లపై ఆర్‌బీఐ కాల్‌ ఆప్షన్‌కు అనుమతినిచ్చింది.You may be interested

ఫ్లాట్‌గా రూపాయి

Friday 7th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.99 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.99గా ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.92 వద్ద ప్రారంభమైంది. 72.04 స్థాయిని కూడా తాకింది. కాగా రూపాయి గురువారం ఇంట్రాడేలో

లాభాల్లోంచి నష్టాల్లోకి

Friday 7th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,242 పాయింట్లతో పోలిస్తే 72 పాయింట్ల లాభంతో 38,314 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,536 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 11,558 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల నష్టంతో 38,109 వద్ద, నిఫ్టీ

Most from this category