STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 31st August 2018
Markets_main1535689448.png-19814

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గెయిల్‌:- పర్యావరణ సంరక్షణలో భాగంగా ఇండియన్‌ రైల్వేలకు కాలుష్యరహిత ఇంధన సరఫరా కోసం ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఐడియా:- ఐడియా-వోడాఫోన్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
మైండ్‌ ట్రీ:- ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలలో ఖాతాదారులకు తమ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందకు వీలుగా గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ జీహెచ్‌డీ సంస్థతో జతకట్టనుంది.
ముత్తూట్‌ ఫైనాన్స్‌:- సెప్టెంబర్‌ 4న జరిగే బోర్డు సమావేశంలో రూ.5వేల కోట్ల ఎన్‌సీడీల జారీ ఇష్యూకు బోర్డు సభ్యులు ఆమోదం తెలపనున్నారు.
హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్చన్స్‌ కంపెనీ:- తన అనుబంధ సంస్థ లావోస్‌ కార్పోరేషన్‌పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
యస్‌ బ్యాంక్‌:- కంపెనీ డెరెక్టర్‌&సీఈవోగా రాణా కపూర్‌ నియామనికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.
కేశోరాం ఇండస్ట్రీస్‌:- ఆగస్ట్‌ 31 నుంచి పి.రాధాకృష్ణన్‌ కంపెనీ సీఈవో బాధ్యతలు తీసుకోనున్నారు.
హబ్‌టన్‌:- ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ప్రక్రియను రద్దు చేసింది.
దిలీప్‌ బిల్డ్‌కాన్‌:- మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,698కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- వ్యక్తిగత కారణాలతో సెప్టెంబర్‌ 30న గగన్‌దీస్‌ సింగ్‌ బేడి రాజీనామా చేశారు.
అలహాదాబాద్‌ బ్యాంక్‌:- సెప్టెంబర్‌1 నుంచి సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌:- ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ డైరెక్టర్‌గా చందా కొచ్చర్‌ నియామకం దాదాపు ఖరారైంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీ జారీ ఇష్యూ ద్వారా రూ.2వేల సమీకరణ ప్రక్రియను పూర్తి చేసింది.
అంజతా ఫార్మా:- కంపెనీ డైరెక్టర్‌ పురుషోత్తం బి.అగర్వాల్‌ తన పదవికి రాజీనామా చేశారు.
హాత్‌వే కేబుల్‌:- ప్రమోటర్‌ సంస్థ నుంచి రూ.100 కోట్లను సమీకరించింది
ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌:- రూ.1000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌:- సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను ఎఎ(-)నుంచి ఎఎ(పాజిటివ్‌)కు సవరించింది.
వోకాహార్డ్‌ ఫార్మా:- రూ.1200 కోట్ల నిధుల సమీకరణకు షేర్‌హోల్డర్ల ఆమోదం కోరనుంది.
టీఐ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:- శ్రీధరణ్‌ రంగరాజన్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
సోరిల్‌ ఇన్‌ఫ్రా రిసోర్స్‌:- ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.210.21 కోట్ల నిధులను సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.You may be interested

మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ 'యూ ఏస్‌'

Friday 31st August 2018

న్యూఢిల్లీ: హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ తాజాగా తమ సబ్‌ బ్రాండ్ యూ కింద కొత్త స్మార్ట్‌ఫోన్ "యూ ఏస్‌"ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్ 6 నుంచి ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ శుభదీప్ పాల్ తెలిపారు. రూ. 6 వేల కన్నా తక్కువ ధర ఉండే స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో ఇది

రూపీ పతనానికి అడ్డుఅదుపు లేదు..

Friday 31st August 2018

రూపాయి పతనమౌతూనే ఉంది. జూన్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం మరో కొత్త జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.74 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇక బీజింగ్‌తో ట్రేడ్‌వార్‌కు సిద్ధమౌతున్నారని నివేదికలు పేర్కొంటుండటం, చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తారనే భయాలు ప్రతికూల ప్రభావం

Most from this category