STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 11th December 2018
Markets_main1544505288.png-22816

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
బ్యాంకింగ్‌ రంగ షేర్లు:- ఆర్‌బీఐ ఛైర్మన్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన చేయడం ఆ ప్రభావం బ్యాంకింగ్‌ షేర్లపై పడవచ్చు.
లుపిన్‌:- గుండె జబ్బుల నివారణ చికిత్సలో ఉపయోగించే ఎపిక్సాబాన్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- దేశీయ మార్కెట్లో బాసెల్‌-III నిబంధనలకు అనుగుణంగా అన్‌సెక్యూర్డ్‌ ధీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది.
విప్రో:- ఆస్ట్రేలియాలో తన డిజటల్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకుంది.
దిలీప్‌ బిల్డ్‌కాన్‌:- కంపెనీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా రాధే శ్యామ్‌ జార్జ్‌ నియమితులయ్యారు.
జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- జీఎంఆర్‌ బజాలీ హోలీ హైడ్రోపవర్‌ ప్రైవేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సీసీడీల జారీ ద్వారా రూ.225.6కోట్లు సమీకరించనుంది.
పీటీసీ ఇండియా:- సంస్థ స్వతంత్ర డైరెక్టర్లుగా రమేశ్‌ నరైన్‌ మిశ్రా, ఆత్మానందం నియమితులయ్యారు.
ఇన్ఫీభీమ్‌ అవెన్యూస్‌:- వివిధ వ్యాపారాల కోసం కంపెనీ సేకరించిన రుణాలకు ఇక్రా రేటింగ్‌ సంస్థ తగ్గించింది.
క్వెస్‌ కార్ప్‌:- ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా డిసెంబర్‌ 07న అజిత్‌ ఐసాక్‌ 48వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు ఐసాక్‌ వాటా మొత్తం వాటా కంపెనీ 12.04శాతం నుంచి 12.07శాతానికి పెరిగింది.
కనోరియా కెమికల్స్ & ఇండస్ట్రీస్‌:- కంపెనీ తన అనుబంధ సంస్థ కనోరియా ఆఫ్రికా టెక్స్‌టైల్‌ పీఎల్‌సీలో 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.ఈ వాటా కొనుగోలుతో కంపెనీలో తన వాటాను 84.45శాతం నుంచి 78.68శాతానికి పెంచుకుంది.
సయాజీ ఇండస్ట్రీస్‌:- షేర్ల విభజనకు రికార్డు తేదిని డిసెంబర్‌ 28గా నిర్ణయించింది.
జెన్సార్‌ టెక్నాలజీస్‌:- బ్రిటల్‌ ఐటీ భాగస్వామిగా ఈబిఆర్‌డీని ఎంపిక చేసింది.
టైటాఘర్‌ వేగన్స్‌:- ఇండియన్‌ రైల్వేస్‌ నుంచి 5,058 వేగన్స్‌ తయారీకి ఆర్డర్లను దక్కించుకుంది. ఈ ఆర్డర్ల మొత్తం విలువ రూ.1,560.87 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఆయిల్‌ ఇండియా:- ప్రభుత్వం తన మొత్తం వాటా 63.2శాతం నుంచి 2.9శాతాన్ని ఉపసంహరించుకుంది.
మెర్క్యూ:- కంపెనీ సీఎఫ్‌ఓ(చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌)గా అమిత్‌ గుప్తా నియమితులయ్యారు.
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- సర్వీస్‌ యూనిట్‌కు అన్ని శాఖల నుంచి అనుమతులు దక్కించుకుంది.You may be interested

ఉర్జిత్‌ రాజీనామాపై బ్రోకరేజ్‌ల రియాక‌్షన్‌!

Tuesday 11th December 2018

వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! కేంద్ర బ్యాంకుకు, కేంద్రానికి మధ్య బయటకు కానరాని విబేధాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉర్జిత్‌ రాజీనామా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉర్జిత్‌ రాజీనామాతో దేశీయ మార్కెట్లు అధోముఖ పయనం ఆరంభించాయి. ఈ నేపథ్యంలో ఉర్జిత్‌రాజీనామా వ్యవహారంపై ప్రముఖ బ్రోకరేజ్‌లు స్పందించాయి. ఈ వ్యవహారం మార్కెట్లపై ప్రభావం చూపడం ఖాయమని కానీ ఇది తాత్కాలిక వ్యవహారమేనని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి.  -

ఎన్‌పీఎస్‌కు పూర్తిగా పన్ను మినహాయింపు 

Tuesday 11th December 2018

న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్‌పీఎస్‌ నుంచి రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ పథకాల మాదిరే ఎన్‌పీఎస్‌కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ

Most from this category