STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th October 2018
Markets_main1540786197.png-21545

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..!
ఐసీఐసీఐ బ్యాంక్‌:- అదనపు డైర్టెక్టర్‌గా హరి ఎల్‌ ముంద్రా నియమితులయ్యారు. ఈయన బ్యాంకు ఐదేళ్ల పాటు తన సేవలను అందించనున్నారు.
బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బెంగళూర్‌లోని కోగిలు రోడ్డులో బ్రిగేడ్‌ బ్రిక్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
క్వాలిటీ:- ప్రస్తుతం సంస్థ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్‌ కుమార్‌ గుప్తా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శరద్‌ బండారీ నియమితులయ్యారు.
కాక్స్‌&కింగ్స్‌:- తన విద్యా వ్యాపారాన్ని బ్రిటన్‌కు చెందిన మిడ్లోథియన్ కాపిటల్ సం‍స్థకు  రూ.4,387 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. మిడ్లోథియన్ కాపిటల్ ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
బాంబే డైయింగ్‌:- ఇండోనేషియా ఫైవ్‌ స్టార్‌ టెక్స్‌టైల్స్‌ రుణాన్ని ఈక్విటీ రూపంలో ఆ సంస్థకు చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
యాక్సిస్‌ బ్యాంక్‌:-  ఈ బ్యాంకుకుఎన్‌ఎస్‌డీఎల్‌లో వున్న వాటాలో ప్రతి షేరు ధర రూ.825లు చొప్పున మొత్తం 20 లక్షల ఈక్విటీ షేర్లను రూ.163.34 కోట్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలుతో ఎన్‌ఎస్‌డీఎల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 5శాతం నుంచి 9.95శాతానికి పెరగనుంది.
యస్‌ బ్యాంక్‌:- నూతన సీఈవో పేరును ఫైనలైజ్‌ చేసినట్లు సెర్చింగ్‌ కమిటీ తెలిపింది.
డాక్టర్‌ లాల్‌ పాత్‌ ల్యాబ్స్‌:- డెల్టా రియా, పాథాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లను విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
హిందూస్థాన్‌ జింక్‌:- కొల్హాపూర్‌లోని దుర్గామన్‌వాడీ మైనింగ్‌లో కార్యకలాపాలకు నిలిపివేసినట్లు తెలిపింది.

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, టాటా పవర్‌ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కోల్గేట్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌, జీపీ పెట్రోలియం, హెచ్‌పీఎల్‌ ఎలక్ట్రిక్‌, వండర్‌లా హాలిడేస్‌, డీసీఎం శ్రీరాం, జస్ట్‌ డయల్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సోలార్‌ ఇండస్ట్రీస్‌, రాణే హోల్డింగ్స్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, చెన్నై పెట్రోలియం కార్పోరేషన్‌, సెంచూరీ టెక్స్‌టైల్స్‌, పంజాబ్‌ కెమికల్స్‌, సాగర్‌ సిమెంట్స్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, రాజ్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌, బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌, స్వరాజ్‌ ఇండస్ట్రీస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, విజయా బ్యాంక్‌, మహీంద్రా హాలిడే, నీల్‌కమల్‌.You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 29th October 2018

డాలర్‌ ఇండెక్స్‌ 10 వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 3నెలల గరిష్టస్థాయి నుంచి దిగివస్తుంది. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,234.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థికవృద్ధి అంచనాల కంటే  తక్కువగా ఉండటంతో పాటు, పలు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వాతావరణ పరిస్థితులు డాలర్‌ ఇండెక్స్‌కు బలాన్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో డాలర్‌

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 29th October 2018

గతవారం భారీ నష్టాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 33,550 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల పెరుగుదలతో 10,078 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత శుక్రవారం నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టపోయి, ఏడు నెలల కనిష్టస్థాయి 10,030 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అదేరోజున మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాల్ని ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్,

Most from this category