STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 15th October 2018
Markets_main1539577668.png-21145

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఐఎల్&ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కార్పోరేషన్‌:- కంపెనీ డెరెక్టర్‌గా సీఎస్‌ రాజన్‌ను నియమితులయ్యారు.
నాట్కో ఫార్మా:- కోపాక్సోన్‌ ఔషధాలపై కంపెనీ ఎలాంటి పేటెంట్‌ రైట్స్‌ లేవని యూఎస్‌ కోర్టు తీర్పు వెల్లడించింది.
నితేశ్‌ ఎస్టేట్స్‌:- తన అనుబంధ సంస్థ నితేశ్ పూణే మాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని 100శాతం వాటాను ఏబీఎల్‌ గ్రూప్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
పీవీఆర్‌:- చెన్నైలోని పీవీఆర్‌ ఐకాన్‌లో 10 మల్టీఫ్లెక్స్‌ స్క్రీన్స్‌లను ప్రారంభించింది.
దన్షిక కమర్షియల్‌:- కంపెనీ ఛైర్మన్‌, సీఎఫ్‌ఓ, డైరెక్టర్‌లు వారి వారి పదవులకు రాజీనామా చేశారు.
నాట్కో:- బై బ్యాక్‌ ఆఫర్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
వీ2 రిటైల్‌:- కర్ణాటకలో కొత్త కమర్షియల్‌ స్టోర్‌ను ప్రారంభించింది.
ఆదిత్యా బిర్లా:- తన అనుబంధ సంస్థ ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కంపెనీ విలీనం చేసుకుంది.
క్యూపిడ్‌:- బోనస్‌ షేర్ల కింద అదనంగా 23 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది.
సద్భవన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రాజెక్ట్స్‌:- కంపెనీ జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై రేటింగ్‌ సంస్థ కేర్‌ రేటింగ్‌ పెంచింది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని కంపెనీలు:- డెల్టా కార్పోరేషన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంటీ ఎడ్యూకేర్‌, నెట్‌వర్క్స్‌ 18 మీడియా, రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, సౌత్‌ఇండియా బ్యాంక్‌, ట్రిడెంట్‌, టీవీ18 బ్రాండ్‌కాస్ట్‌


HUL

You may be interested

రూపీ క్షీణత

Monday 15th October 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం మళ్లీ బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.91 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 73.57తో పోలిస్తే 0.41 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 73.80 వద్ద ప్రారంభమైంది.   రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా పెరడగం వల్ల బాండ్‌ ఈల్డ్స్‌

గ్యాప్‌అప్‌తో ఆరంభం..

Monday 15th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,733 పాయింట్లతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 34,971 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,472 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,524 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు రెండూ వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:31 సమయంలో సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో

Most from this category