STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 26th November 2018
Markets_main1543207270.png-22375

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు

బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 59 డాలర్ల దిగువకు చేరిన నేపథ్యంలో ఆయిల్‌ మార్కెట్‌, ఏవియేషన్‌ షేర్లతో పాటు అపోలో టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, సియెట్‌, ఏషియన్‌ పేయింట్స్‌, నెరోలాక్‌ పెయింట్‌ షేర్లులో ర్యాలీ జరగవచ్చు.
ఇండెక్స్‌లో మార్పులు, చేర్పులు:- బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ సూచీలు విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లను చేర్చారు. సవరించిన మార్పులు డిసెంబర్‌ 24నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ నాలుగు షేర్ల ట్రేడింగ్లో కదలికలు గమనింవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- ప్రస్తుతం కంపెనీకి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న రుషాద్‌ అబాడాన్‌ స్థానంలో జెర్రి గ్రీమ్‌స్టోమ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న జేమ్స్‌ అరైడ్‌ స్థానంలో నార్మన్‌ కైత్‌కోచ్‌లు నియమితులయ్యారు.
స్టెరైడ్‌ ఫార్మా సెన్స్‌:- స్టైలైన్స్‌ బయోఫార్మా, ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ వాటా కొనుగోలుకు అవసరమైన రూ.106 కోట్లను సీరీస్‌ బీ ఫండ్‌రైజింగ్‌ పద్ధతిలో నిధులను సమీకరించనున్నారు. ఇప్పటికే స్టెలైన్స్‌ బయోఫార్మాలో స్టెరైడ్స్‌ ఫార్మాకు 36శాతం వాటా కలిగి ఉంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- ముంద్రా కాపర్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో సమాచారం ఇచ్చింది.
కెయిర్న్‌ ఎనర్జీ:- సుమారు రూ.10247 కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ఐటీ ఆదాయ పన్ను శాఖ కెయిర్న్‌ ఎనర్జీకి చెందిన 25లక్షల వేదాంత ఈక్విటీ షేర్లను విక్రయించింది. తద్వారా రూ.5500 కోట్లను రీకవరీ చేసుకుంది.
సుందర్‌ మల్టీ పేపర్‌ లిమిటెడ్‌:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ కేర్‌... కంపెనీ రేటింగ్‌ను బిబి నుంచి బిబి(-)స్థిరత్వానికి సవరించినట్లు ప్రకటించింది.
ఇండియన్‌ కార్డ్‌ క్లాతింగ్‌:- కంపెనీ సీఈవో(ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా వినోద్‌విజపుల్లి నియమితులయ్యారు.
విపుల్‌ ఆర్గానిక్స్‌:- ఎఫ్‌ఎంఆర్కే ప్రైవేట్‌ లిమిటెలో విలీనానికి బీఎస్‌ఈ నుంచి నో అబ్జర్వేషన్‌ లెటర్‌ను పొందింది.
శ్రీరామా మల్టీటెక్‌:- గుజరాత్‌లోని అంబలియారా యూనిట్‌ అమ్మకానికి బోర్డు నుంచి అనుమతులు దక్కించుకుంది.
ఐఓసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇరాన్‌ నుంచి 9మిలియన్‌ టన్నుల క్రూడాయిల్ దిగుమతి లక్ష్యాన్ని అందుకుంటుందనే అంచనా వేసింది.
ఐఐఎఫ్‌ఎల్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.5వేల కోట్ల నిధుల సమీరకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా రంజన్‌మతై రాజీనామా చేశారు.
ఏయూస్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌:- వివిధ మార్గాల్లో పలు విడుతల్లో బాండ్లు, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌:- కంపెనీ రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.You may be interested

పుంజుకుంటున్న డాలర్‌ ఇండెక్స్‌: ఫ్లాట్‌గా పసిడి ధర

Monday 26th November 2018

ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలర్‌ లాభపడి 1,224.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ గురువారం వెలువనుండంతో పాటు జీ-20 సదస్సులో అమెరికా, చైనా దేశాధ్యక్షులు వాణిజ్య యుద్ధం చర్చలపై కూడా పసిడి కదలికలపై ప్రభావాన్ని

3 నెలల గరిష్టస్థాయికి రూపాయి

Monday 26th November 2018

డాలరుతో 70.52 వద్ద ప్రారంభం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 18 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.52 దగ్గర ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర 60 డాలర్ల దిగువకు పతనమైన నేపథ్యంలో వరుసగా 8వ రోజూ రూపాయి మారకం విలువ బలపడింది. మూడు నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో దేశీయ స్టాక్‌ సూచీలు లాభాల్లో

Most from this category