STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 6th February 2019
Markets_main1549423424.png-24033

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు
లుపిన్:-  అమెరికా మార్కెట్లోకి  క్లోమిపారైన్ హైడ్రోక్లోరైడ్ జ‌న‌రిక్  ఔష‌ధాల‌ను విడుద‌ల చేసింది. సంబంధిత  ఔష‌ధాల‌ను అతి శుభ్రత వ్యాధి(ఓసీడీ) నివార‌ణ చికిత్సలో వినియోగిస్తారు.
యాక్సిస్ బ్యాంక్‌:- కార్పోరేట్ చ‌ట్టాల‌ నియ‌మాళిని ఉల్లంఘించినందుకు ఆర్‌బీఐ రూ.కోటిల జ‌రిమానా విధించింది.
డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జ‌న‌రిక్ ఔష‌దం సుబాక్సోన్ కేసులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో ఊర‌ట ల‌భించింది.
ఎన్‌బీసీసీ:- వివిధ వ్యాపార విభాగాల నుంచి కంపెనీ జ‌న‌వ‌రిలో మొత్తం రూ. 360 కోట్ల ఆర్డర్లను ద‌క్కించుకుంది.
సెంచూరీ ప్లేబోర్డ్స్‌:- ఉత్తర‌ప్రదేశ్‌లో ఎండీఎఫ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుంది.
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా:- రుణాల‌పై వ‌డ్డీరేట్లను 10 - 20 బేసిస్ పాయింట్లను పెంచింది.  పెంచిన వ‌డ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
ఐఎల్‌ఎఫ్ఎస్‌:- గ్రూప్ కంపెనీల వివ‌రాలు, ఆర్ధిక స్థితిగ‌తులు ఆధారంగా వ‌ర్గీక‌రించి స‌మర్పించాల‌ని ఎన్‌సీఎల్‌టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భార‌తీ ఎయిర్‌టెల్‌:- క్రిడెట్ రేటింగ్‌ను బీఏఏ3 సీనియర్ అన్‌సెక్యూర్డ్ రేటింగ్ నుంచి బీఏ1 కార్పోరేట్ ఫ్యామిలీ రేటింగ్‌కు త‌గ్గించిన‌ట్లు మూడీస్ ప్రక‌టించింది.
పవ‌ర్ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌:- ఆర్ఈసీలో 52శాతం వాటా కొనుగోలు చేయడానికి కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలిపింది.
నేడు క్యూ3 ఫలితాల‌ను ప్రక‌టించే కొన్న ప్రధాన కంపెనీల వివరాలు:-
అల‌హాదాబాద్ బ్యాంక్‌, ఆర్చీస్‌, అభిన‌వ్ క్యాపిట‌ల్‌, ఆల్ఫా ఐసీఏ, ఆస్ట్రాజెనికా, ఆసియ‌న్ ఆయిల్ ఫీల్డ్‌, అదానీ ప‌వ‌ర్‌, ఏసీఏం టెక్‌, బెంగ‌ళూర్ పోర్ట్‌, బజాజ్ స్టీల్‌, సిప్లా, సీజీ ప‌వ‌ర్‌, క‌మ్మిన్స్‌, కెమ్‌టెక్ ఇండియా, జైడ‌స్ వెల్‌నెస్‌, ఈఎన్‌టీ నెట్ వర్క్ ఇండియా, ఫ్యూచ‌ర్ క‌న్జ్యూమ‌ర్, గ్రాఫైట్ ఇండియా, వోడాఫోన్ ఐడియా, ఇండియ‌న్ హ్యూమ్‌,  ఐల్ అండ్ ఎఫ్ఎస్‌, జిందాల్ స్టీల్‌నెస్‌, జేఎస్‌డ‌బ్ల్యూస్టీల్‌, కాయా, కేఎం షుగ‌ర్ మిల్స్‌, లుపిన్‌, మంగ‌ళూర్ కెమిక‌ల్స్ లిమిటెడ్‌, ముత్తూట్ ఫైనాన్స్, మ‌ణిప్పురం ఫైనాన్స్,  బాల‌క్రిష్ణ పేప‌ర్ మిల్స్, ప్రిజం సిమెంట్స్‌, ప్రీమియం క్యాపిట‌ల్‌, పుంజ్ లాయిడ్‌, ప్ర‌దీప్ మెట‌ల్స్‌, సైమెన్స్, శివ‌రాం అటో, సంఘీ ఇండస్ట్రీస్‌, విస్టా  ఫార్మా, వెంకీస్‌, వీల్స్.You may be interested

నాలుగు నెలల గరిష్టస్థాయికి మార్కెట్‌

Wednesday 6th February 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమై, కొద్ది నిముషాలకే నాలుగు నెలల గరిష్టస్థాయిని అందుకుంది.  సెన్సెక్స్‌ గత ముగింపు(36,616)తో పోలిస్తే 97 పాయిం‍ట్ల లాభంతో 36,714.54 వద్ద, నిఫ్టీ గతముగింపు(10,934.35)తో పోలిస్తే 31 పాయిం‍ట్లు పెరిగి 10,965 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అన్ని రంగాలకు చెందిన షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ ఇండెక్స్‌ 11,000 స్థాయికి అందుకుంది. ఐటీ, మెటల్‌,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు అప్‌

Wednesday 6th February 2019

క్రితం రోజు యూరప్‌, అమెరికా సూచీలు ర్యాలీ సాగించడం, తాజాగా జపాన్‌ సూచీ పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.45  గంటలకు 11,012  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,951 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం  ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత క్రమేపీ ప్రపంచ మార్కెట్లు పెరుగుతున్న

Most from this category