STOCKS

News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 12th March 2019
Markets_main1552364260.png-24539

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
టీవీఎస్‌ మోటర్‌:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.  ఒక రూపాయి ముఖ విలువ కలిగిన  ఒక్కో  షేరుకి రూ. 1.40 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ  బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌ లో  తెలిపింది.   
లార్సన్‌ లాబ్స్‌:- మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సిక్లోరోక్వినైన్‌ ఔషధ విక్రయాలకు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతులు దక్కించుకుంది. అలాగే హెచ్‌ఐవీ వ్యాధి నివారణకు వినియోగించే ఏడీఎల్‌ జనరిక్‌ ఔషధ తాత్కలిక అనుమతులను ఏఎన్‌డీఏ నుంచి దక్కించుకుంది.
సుందరమ్‌ క్లేటన్:- వాటాదారులకు ఒక్కో​షేరుకి రూ.16లు చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 
అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్ టెక్నాలజీస్‌:- అధర్వ గ్రీన్‌ ఎకోటెక్‌ ఎల్‌ఎల్‌పీ 6.24వాటాకు సమానమైన ఈక్విటీషేర్లను మార్చి 8న ఓపెన్‌ మార్కెట్లో విక్రయించింది. అలాగే ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలైన చంద్రకాంత్‌ రాఠి ఇన్నోవేషన్స్‌ 1.43శాతం, ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 16.87శాతం వాటాలను తగ్గించుకున్నాయి.  
ఉజ్జాస్‌ ఎనర్జీ:- తన అనుబంధ సంస్థ ఐజోబా ఎనర్జీ వన్ లిమిటెడ్‌లో మొత్తం వాటాను ఏసీఏ ఇంటర్నేషనల్‌ కామర్స్‌ ఎఫ్‌జడ్‌ఈ సంస్థలోకి మార్చేందుకు బోర్డు డైరెక్టర్ల అనుమతులు దక్కించుకుంది. 
వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌:- అంతర్జాతీయంగా 212 కిలోమెట్రిక్‌టన్నుల ఆర్డర్లను దక్కించుకోగా, అందులో మనదేశం నుంచి 151 కేఎంటీల ఆర్డర్లను పొందింది. 
అడ్‌లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌:-  0.7శాతం వాటాలకు సమానమైన కంపెనీ ఈక్విటీ షేర్లను తనఖా పెట్టిన ప్రమోటర్‌ థ్రిల్ పార్క్ కంపెనీ ఇప్పుడు వాటాను విడుదల చేసింది.
కేఈఐ ఇండస్ట్రీస్‌:- రాజస్థాన్‌ ప్లాంట్‌లోని మీడియం వోల్టేజ్‌ కేబుల్స్‌ వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. 
రైట్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో​షేరుకి రూ.4 లు చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- ప్రమోటర్‌లో ఒకటైన స్టాండర్డ్‌ లైఫ్‌ 4.93శాతం వాటాను విక్రయిస్తుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో 4.93శాతం వాటాకు సమానమైన దాదాపు 9.95 కోట్ల ఈక్విటీ షేర్లను నేడు విక్రయించనుంది. ఇష్యూకు ఫ్లోర్‌ ధరను రూ.357.50లుగా నిర్ణయించింది.You may be interested

ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ

Tuesday 12th March 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.370.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికే 3శాతం లాభపడి రూ.386.70లకు ఎగిసింది. ఈ ధర షేరకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.10:00నిల.కు షేరు గత ముగింపు

భారీ గ్యాప్‌అప్‌

Tuesday 12th March 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 280 పాయింట్లు జంప్‌చేసి 37,335 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రో, టాటా మోటార్స్‌, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌లు 1-2 శాతం లాభంతో ప్రారంభంకాగా, ఇన్‌ఫ్రాటెల్‌, భారతి ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.పెట్రోకెమికల్స్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఆల్‌టైమ్‌ గరిష్టం అయిన రూ.1329 స్థాయిని

Most from this category