STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 4th October 2018
Markets_main1538627491.png-20846

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హాత్‌వే కేబుల్‌:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కోసం హాథ్‌దే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.
గతి లాజిస్టిక్స్‌ ఇండస్ట్రీస్‌:- నేడు కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరగనుంది.
జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌:- ఇం‍డియా రేటింగ్‌&రీసెర్చ్‌ సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను బిబిబి(స్థిరత్వం)కు పెంచింది.
ఇన్ఫీభీమ్‌ అవెన్యూస్‌:- ఎజ్రా చారిటబుల్ ట్రస్ట్ ప్రతి షేరు ధర రూ.73.99 చొప్పున మొత్తం 38లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
ఫెడరల్‌ బ్యాంక్‌:- నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఆర్‌బీఐ మొత్తం రూ.5కోట్ల జరిమానాను విధించింది.
హెచ్‌డీఎఫ్‌సీ:- హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీ ఐపీఓ ద్వారా కంపెనీ జూలై-సెప్టెంబర్‌ కాలంలో మొత్తం రూ.787 కోట్లను ఆర్జించింది.
బీఎస్‌ఈ లిమిటెడ్‌:- వ్యాపార అవసరాల నిమిత్తం లండన్‌ మెటల్‌ ఎక్చ్సేంజ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
పీటీసీ ఇండియా ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- డాక్టర్‌ పవన్‌ సింగ్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఏయూ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌:- రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌... కంపెనీ రేటింగ్‌ను ఎఎఎ(స్థిరత్వం)కు పెంచింది.
ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.250 కోట్ల నిధుల సమీకరించనుంది. అందుకు అక్టోబర్‌ 08న బోర్డు సమావేశం  నిర్వహించనుంది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌:- కొత్తగా ఏర్పాటైన బోర్డు నేడు సమావేశం కానుంది. సంస్థ ప్రస్తుత పరిస్థితులను అంచనావేయడంతో పాటు, సంస్థ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తగిన ప్రణాళికలు రూపొంది కేంద్ర ఆర్థికశాఖకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్‌:- మూడు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌పై రూ.21 కోట్లు చెల్లించడంలో మళ్లీ విఫలమైంది.
అమర రాజా బ్యాటరీస్‌:- దేశంలో కొత్త రకం బ్యాటరీలను రూపొందించేందుకు జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీతో జట్టు కట్టనుంది.
జేబీ కెమికల్స్‌:- షేర్ల బైబ్యాక్‌  ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24న ముగుస్తుంది. ఒక్కో షేరును రూ.390 చొప్పును ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.130 కోట్లని కంపెనీ వివరించింది.
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు:- ఓవర్సీ్‌స్‌ రుణాల సమీకరణలపై ఆర్‌బీఐ నిబంధనలను సరళీకరించింది.



You may be interested

ఈ షేర్లతోనే సూచీల పతనం

Thursday 4th October 2018

నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న ముడి చమురుధర, జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి ధర...  కలిసి గురువారం మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 600పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ సూచీ 200 పాయింట్లను నష్టపోయింది. హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి. నిఫ్టీ కోల్పోయిన 200 పాయింట్లలో ...... 1.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(5శాతం నష్టం)- 42.11పాయింట్లు 2.టీసీఎస్‌ (3.50శాతం నష్టం)-

‘రూపాయి’ కారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్లు

Thursday 4th October 2018

దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్‌ కొనాలంటే తాజాగా 73.34 రూపాయలు చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.88. 2018లో ఇంత వరకు 14 శాతం నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్‌లో ఉంది.

Most from this category