STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 10th July 2018
Markets_main1531200119.png-18160

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- జూలై 12న జరిగే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చించనుంది.
బజాజ్‌ హిందూస్తాన్‌ షుగర్స్‌:- లలిత్‌పూర్‌ పవర్‌ జనరేషన్‌ సంస్థను తన అనుబంధ సంస్థ బజాజ్‌ ఎనర్జీకి అమ్మేసే అంశంపై ఆగస్టు 4న జరిగే బోర్డు అసాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చించేందుకు బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది.
జమ్మూ & కాశ్మీర్‌ బ్యాంక్‌:- జూలై 9న కంపెనీ సాదారణ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
హిందూస్థాన్‌ కాపర్‌:- సుఖన్ కుమార్ బందోపాధ్యాయ డైరెక్టర్‌గా తిరిగి నియమితులయ్యారు.
అస్ట్రోపాలిటెక్నిక్‌:- రెక్స్‌ పాలీఎక్స్‌ట్రూషన్‌లో 51శాతం వాటాను నగదు రూపంలో కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌:- పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్ట్‌ మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి రూ.2520 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
ఎస్‌ఆర్‌ఎప్‌:- థాయ్‌లాండ్‌లోని రూ.410 కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది.
నెట్‌వర్క్‌18:- నూతన ఎండీగా రాహుల్‌ జోషి నియమితులయ్యారు.
లుపిన్‌:- మలేరియా డ్రగ్స్‌ ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
క్యాపిటల్‌ ఫస్ట్‌:- రుణ పద్ధతిలో రూ.100కోట్ల నిధులను సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌:- సంస్థ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జ్యోతి దేశ్‌పాండేను నియమించారు. త్వరలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ జోషి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సిటీ యూనియన్‌ బ్యాంక్‌:- 1:10 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించింది.
ఆక్టో ఇంటర్నేషనల్‌:- రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరు రూ.2లుగా విభజన చెందుతున్నట్లు ప్రకటించింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌, కొరే ఫుడ్స్‌You may be interested

నేడే ఇండస్‌ ఇండ్‌ ఫలితాలు

Tuesday 10th July 2018

మంగళవారం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ క్యు1 ఫలితాలు ప్రకటించనుంది. దీంతో బ్యాంకింగ్‌ ఎర్నింగ్స్‌కు తెరతీసినట్లు కానుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభంలో 21 శాతం వృద్ధి నమోదుకావచ్చని రాయిటర్‌ పోల్‌లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌తో కలయిక కారణంగా ఈ దఫా లాభంలో 46 శాతం వృద్ధి ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది.  ఫలితాల్లో ఇతర కీలక అంచనాలు... - నికర వడ్డీ మార్జిన్లు 19 శాతం పెరిగి 2128

టీసీఎస్‌ ఫలితాలు.. వీటిపై లుక్కేయండి..

Tuesday 10th July 2018

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ మంగళవారం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ దఫా కూడా కంపెనీ బలమైన ఫలితాలను అందించవచ్చని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితాల్లో కీలకమైన కొన్ని అంశాలపై మార్కెట్‌ వర్గాల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. 1. బీఎఫ్‌ఎస్‌ఐ డిమాండ్‌ అవుట్‌లుక్‌: గత కొన్నాళ్లుగా ఈ విభాగంలో వృద్ధి ఇతర విభాగాలతో పోలిస్తే మందకొడిగా ఉంటోంది. అయితే ఈ ఏడాది బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంపై ఆశాజనకంగా

Most from this category