STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 28th March 2019
Markets_main1553752035.png-24836

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గ్రాసీం ఇండస్ట్రీస్‌:-
అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు  రూ.10లక్షల ముఖవిలువ కలిగిన సుమారు 5వేల ఎన్‌సీడీలను జారీ చేసింది. తద్వారా కంపెనీ రూ.500 కోట్ల సమీకరణకు పూర్తి చేసింది. 
టెక్స్‌మో పైప్స్‌ అండ్‌ ప్రోడెక్స్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలలో కంపెనీ ప్రమోటర్‌ సంస్థ పద్మావతీ ఇరిగేషన్‌కు 13 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఇందుకు ప్రతి షేరు ధర రూ.23.20లుగా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.3.01 కోట్లను సమీకరించనుంది. 
నాల్కో:- నెలిటో సిస్టమ్స్ తన మొత్తం 12.30శాతం వాటాను జపాన్‌ కంపెనీ డీటీఎస్‌ కార్పోరేషన్‌కు రూ.7కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఆడోర్స్‌ వెల్డింగ్‌:- కేర్‌ రేటింగ్‌ సం‍స్థ ధీర్ఘకాలంలో బ్యాంకు సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ రేటింగ్‌ను ఎఎ(స్థిరత్వం) నుంచి ఎఎ(-)కు తగ్గించింది. 
మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి తన అనుబంధ సంస్థ మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎంఆర్హెచ్ఎఫ్ఎల్) కంపెనీకి చెందిన 1,18,91,511 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఈక్విటీ షేర్లకు సమీకరణకు కంపెనీ మొత్తం రూ.286.78కోట్లను వెచ్చించనుంది. 
మారథాన్‌ నెక్ట్స్‌జెన్‌ రియల్టీ:- తన అనుబంధ సంస్థ మారథాన్ నెక్ట్స్‌జెన్‌ టౌన్‌షిప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100శాతం వాటా విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. 
రుబీ మిల్స్‌:- కార్మికుల సమ్మెతో మహారాష్ట్రలోని కర్చుంది యూనిట్‌లో ఉత్పత్తిని నిలిచిపోయినట్లు స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
ఎన్‌టీపీసీ:- అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ల జారీ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించింది. 
కార్పొరేషన్‌ బ్యాంక్‌:- ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఒక్కో షేరు రూ.26.68 చొప్పున 340.6 కోట్ల షేర్లను జారీ చేయనుంది. 
యూనికెమ్‌ లేబొరేటరీస్‌:- అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి టడలాఫిల్‌ ట్యాబ్లెట్లకు తుది అనుమతులు దక్కించుకుంది.
వేదాంత:- తమిళనాడులోని సెర్టిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ కేసు ఏప్రిల్‌ 23కు వాయిదా పడింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికా మార్కెట్లోకి టడాలఫిల్‌ ఔషదాలను ప్రవేశపెట్టింది. 
ఎన్‌బీసీసీ:- దేశవ్యాప్తంగా 5 ప్రాజెక్టులకు సంబంధించి రూ.1,003 కోట్ల ఆర్డర్లను సంపాదించింది. You may be interested

అవకాశముంటే.. మళ్లీ వస్తా...

Thursday 28th March 2019

అవకాశముంటే.. మళ్లీ వస్తా.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి ఆర్థిక మంత్రిగా రావొచ్చన్న ఊహాగానాలపై స్పష్టీకరణ న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గానీ గెలిస్తే తాను ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయన్న వార్తలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్‌ తిరిగి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 'ది థర్డ్‌ పిల్లర్‌' పేరిట రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో

బొనాంజ పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 28th March 2019

షార్ట్‌టర్మ్‌లో 6-8 శాతం రాబడినిచ్చే మూడు స్టాకులను బొనాంజ పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది. 1. గృహ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 290. స్టాప్‌లాస్‌ రూ. 256. 2. ఐజీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 324. స్టాప్‌లాస్‌ రూ. 296. 3. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 722. స్టాప్‌లాస్‌ రూ. 644. గురువారం డెరివేటివ్స్‌ ముగింపు రోజున సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

Most from this category