STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 9th August 2018
Markets_main1533787417.png-19060

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
సేలన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డాలీ ఖన్నా 1.50లక్షల ఈక్విటీ షేర్లును కోనుగోలు చేశారు.
సన్‌టెక్స్‌ రియల్టీ:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సం‍స్థ 10లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
వింధ్యా టెలిలింక్‌:- ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరు ధర రూ.1,333.28ల వద్ద మొత్తం 1.60లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌:- తన భాగస్వామి సంస్థ కల్పతరు గార్డెన్స్‌తో ఆదాయ లావాదేవీని పంచుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఫోర్బ్‌ & కంపెనీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ.250 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
అదానీ గ్రీన్‌ ఎనర్జీ:- మూలధన వ్యయానికి రూ.5వేల కోట్ల నిధుల సమీకరణకు షేర్‌హోల్డర్ల అనుమతి సంపాదించింది.
యాక్సి్‌స్‌ బ్యాంకు:- ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త 350-450 బ్రాంచుల ఏర్పాటుకు యోచిస్తోంది.
టాటా స్టీల్‌:- భూషణ్‌ పవర్‌ & స్టీల్‌ దక్కించుకునేందుకు సీసీఐ అనుమతి పొందింది.
పిడిలైట్‌:- అమెరికాలోని తన అనుబంధ సంస్థలో 5,00,000డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది.
మాస్టేక్‌:- రేటింగ్‌ సంస్థ ఇక్రా సంస్థ ధీర్ఘకాలకిక రుణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎ(ప్లస్‌) రేటింగ్‌ను కేటాయించింది.
కార్పోరేషన్‌ బ్యాంకు:- కేంద్ర ప్రభుత్వానికి ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్దతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.255 కోట్లను సమీకరించే అంశానికి బోర్డు ఆమోదం తెలిపింది.
నేడు క్యూ1 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలు:-
ఐషర్‌ మోటర్స్‌, అరబిందో ఫార్మా, పేజ్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ ఫోర్జ్‌, ఎంఆర్‌ఎఫ్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, కుమ్మిన్స్‌ ఇండియా, టాటా కమ్యూనికేషన్‌, మణిప్పురం ఫైనాన్స్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఫ్యూచర్స్‌ రిటైల్‌, వరల్స్‌ఫూల్స్‌, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, కాఫీడే, కేఈఐ ఇండస్ట్రీస్‌, యూనిటెడ్‌ బ్యాంక్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, కావేరీ సీడ్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వరుణ్‌ బేవరీజ్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, హిందూస్థాన్‌ కాపర్‌, వెంకీస్‌, స్వాన్‌ ఎనర్జీ, మహీంద్రా హాలిడే, ఇక్రా, టీవీ టుడే, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, హెల్త్‌కేర్‌ గ్లోబల్‌



You may be interested

రూపాయి రయ్‌.. రయ్‌..

Thursday 9th August 2018

68.47 వద్ద ప్రారంభం బుధవారం ముగింపు 68.63తో పోలిస్తే 0.24 శాతం అప్‌ ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. రిజర్వు బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెంట్‌ అందిస్తామని ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల ప్రభుత్వానికి నిధులు సమకూరి, ద్రవ్యలోటు కొంత తగ్గుతుంది. క్రూడ్‌ అయిల్‌ ధరలు తగ్గడం, మార్కెట్లు సానుకూలముగా ఉండటం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9:10

సెన్సెక్స్‌ @ 38,000

Thursday 9th August 2018

బుల్‌ రంకెలేస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తొలిసారి 38,000 మార్క్‌ను తాకింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,888 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 37,995 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. వెంటనే 38,050 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,450 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,493 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

Most from this category