STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 2nd April 2019
Markets_main1554177496.png-24913

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు 
క‌ర్ణాట‌క బ్యాక్ :-
ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం(2019-20)లో రూ.1,44,000 కోట్ల ట‌ర్నోవ‌ర్ వ్యాపారాన్ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. 
బన్స్వారా సింటెక్స్‌:- కేర్ రేటింగ్ సంస్థ... కంపెనీకు ఇటీవ‌ల  కేటాయించిన రేటింగ్‌ను యథాత‌ధంగా కొన‌సాగిస్తున్నట్లు తెలిపింది. 
ఎల‌న్టాస్ బెక్ ఇండియా:-  కంపెనీ డైరెక్టర్‌గా శ్రీకుమార్ రామ‌కృష్ణ నియామానికి బోర్డు ఆమోదం తెలిపింది. 
టాటా పవ‌ర్‌:-  అనుబంధ సంస్థ టాటా ప‌వ‌ర్ ఎస్ఈడీ ఇండియన్ నేవీకి కోంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సేవ‌లను అందించ‌నుంది.
ఎంఅండ్ఎం:- జోర్డాన్ దేశంలో అర్మాడ్ వాహ‌నాన్ని ప్రవేశపెట్టింది. 
త‌నీజా ఏరోస్పేస్ అండ్ ఏవియేష‌న్‌:- కేర్ రేటింగ్ లిమిటెడ్ కంపెనీ గ‌ల బ్యాంకు స‌దుపాయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఏ4 రేటింగ్‌ను కేటాయించింది.  
ఐడీబీఐ బ్యాంక్‌:- ఐడీబీఐ అసెట్ మేనేజ్మెంట్లో వాటాను విక్రయించడానికి సలహాదారున్ని అడ్వజైర్‌ నియమకానికి బ్యాంకు తీస్తుంది. 
గోద్రేజ్‌ ప్రాప‌ర్టీస్‌:-  గ‌త ఆర్థిక సంవ‌త్సరం చివరి త్రైమాసికంలో సుమారు 2900 ఇళ్లను విక్రయించి రూ.2100 కోట్లను ఆర్జించిన‌ట్లు ఎక్చ్సేంజ్‌ల‌కు స‌మాచారం ఇచ్చింది.  
గేట్ వే డిస్ట్రిపార్క్‌:- బ్లాక్ స్టోన్ విభాగం చెందిన అనుబంధ సంస్థను రూ.850 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు ప్రక‌టించింది. 
పీవీఆర్‌:- దేశ‌వ్యాప్తంగా 4 మ‌ల్టీఫ్లెక్స్‌ కాంపెక్స్‌లను ప్రారంభించింది. 
ఓరియంటల్‌ హోటల్స్‌:- మైసూర్‌లో భూమిని రూ.20కోట్లకు విక్రయించింది. 
బజాజ్‌ హెల్త్‌కేర్‌:- బోనస్‌ షేర్ల ఇష్యూకు రికార్డు ఏప్రిల్‌ 08వ తేదిగా నిర్ణయించింది. 

హెచ్‌సీఎల్‌:- ఐబీఎం భాగస్వామ్యంతో కలిసి పనిచేందుకు యూరోపియన్‌ యూనియన్‌ ఆమోదం తెలిపింది.
నిన్న విడుదలైన వాహన విక్రయ గణాంకాల వివరాలు నేడు ఆటో షేర్లపై ప్రభావాన్ని చూపవచ్చు.



You may be interested

వాహన విక్రయాలకు డిమాండ్‌ దెబ్బ

Tuesday 2nd April 2019

వాహన విక్రయాలకు డిమాండ్‌ దెబ్బ - సింగిల్ డిజిట్‌ వృద్ధికే దిగ్గజాలు పరిమితం - 2018-19లో డిమాండ్‌ తగ్గుదల న్యూఢిల్లీ:- దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018-19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే

11,700పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 2nd April 2019

క్రితం రోజు ముగింపు సమయంలో లాభాల స్వీకరణకు లోనైన స్టాక్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 38,986 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 11,700 పాయింట్ల ఎగువన మొదలయ్యాయి. అయితే ట్రేడింగ్‌ మొదలైన కొద్దిసేపటికే ప్రారంభలాభాల్లో కొద్దిభాగాన్ని సూచీలు కోల్పోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐషర్‌ మోటార్స్‌ 3 శాతం జంప్‌చేయగా, భారతి ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌లు 1 శాతంపైగా లాభాలతో

Most from this category