News


బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 19th December 2018
Markets_main1545193487.png-23059

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీలో యస్‌ బ్యాంక్‌  వివిధ విడతల్లో​ 2.13శాతం వాటాను విక్రయించింది.
జే కుమార్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రూ.1,349 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
వెల్‌స్పాన్‌ ఎంటర్‌ప్రైజెర్‌:- భోపాల్‌ దివాస్‌ కారిడర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 13శాతం వాటాను రూ.57.7కోట్లకు విక్రయించింది. ఈ అమ్మకంతో భోపాల్‌ దివాస్‌ కారిడర్‌ ప్రైవేట్‌ మొత్తం 50శాతం వాటాను ఉపసంహరించుకున్నట్లైంది.
పుష్పక్‌:- బ్యాంకు సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని రేటింగ్‌ సం‍స్థ క్రిసెల్‌ కంపెనీ రేటింగ్‌ను ఎ(నెగిటివ్‌)నుంచి ఎ(స్థిరత్వం)కు సవరించింది.
ఐడీబీఐ బ్యాంక్‌:- ఎల్‌ఐసీ ఓపెన్‌ మార్కెట్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీలో అదనంగా 26శాతం వాటా కొనుగోలు సిద్ధమైనట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
డీహెచ్‌ఎల్‌ఎఫ్‌:- డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా అసెట్‌ మేనేజ్‌మెర్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించింది. జాయింట్‌ వెంచర్‌ తనకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్స్‌కు విక్రయిస్తునట్లు కంపెనీ తెలిపింది.
గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- అమెరికా మార్కెట్లో డెర్మటాలజీ ఫార్మా విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ తెలిపింది.
మైండ్‌ ట్రీ:- కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎన్‌ఎస్‌ పార్థసారధి పునర్నియామానికి షేరు హోల్డర్లు ఆమోదం తెలిపారు.
కమర్షియల్‌ ఇంజనీరింగ్స్‌:- రూ.155 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- సప్రోపెరిన్ డైహైడ్రోక్లోరైడ్ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తాత్కలిక అనుమతులు దక్కించుకుంది.
మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- రూ.10వేల కోట్ల విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ అంశంపె చర్చించేందుకు కంపెనీ డిసెంబర్‌ 21న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
కర్ణాటక బ్యాంక్‌:- వినియోగదారులకు గృహరుణాలకు సంబంధించి పైసాబజార్‌డాట్‌కామ్‌ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.You may be interested

సీఎస్‌ఆర్‌ దీర్ఘకాలిక వ్యూహంగా ఉండాలి

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాల (సీఎస్‌ఆర్‌)ను కంపెనీలు తాత్కాలికమైనవిగా భావించకుండా.. దీర్ఘకాల వ్యూహంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి పి.పి.చౌదరి సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించేందుకు కూడా సీఎస్‌ఆర్ కార్యకలాపాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన జాతీయ సీఎస్‌ఆర్ సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీల చట్టం 2013 కింద లాభదాయక కంపెనీలు తమ మూడేళ్ల సగటు నికర

ఐదేళ్లలో అతిపెద్ద జంప్‌

Wednesday 19th December 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం భారీగా లాభపడింది. ఒకేరోజు 112 పైసలు బలపడి 70.44 వద్ద ముగిసింది.  రూపాయి కేవలం ఒక్కరోజే ఈ స్థాయిలో రికవరీ కావడం గడచిన ఐదేళ్లో ఇదే తొలిసారి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పతనం కావటం, దీనితో దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటుపై భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 71.34 వద్ద ప్రారంభమైన రూపాయి,

Most from this category