STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th October 2018
Markets_main1539146107.png-20992

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికాలో మార్కెట్‌లో డయాబెటీస్‌ చికిత్సలో వినియోగించే కోలేసెవేలామ్‌ హెచ్‌సీఎల్‌ ఔషధాలను విడుదల చేసింది. ఈ ఔషధ వార్షిక మార్కెట్‌ విలువ రూ.34వేల కోట్లు ఉంటుంది.
హెల్త్‌కేర్‌ గ్లోబల్స్‌:​- తన అనుబంధ సంస్థ ఇండియా మెడికల్‌ డయాగ్నస్టిక్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు క్వెస్ట్‌ డయాగ్నస్టిక్స్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చకుంది.
ఎన్‌సీఎల్‌ ఇండియా:- రూ.1249 కోట్ల షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.88 చొప్పున కంపెనీ మొత్తం 14.2కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లను నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది.
నాల్కో:- బై బ్యాక్‌ అంశంపై  చర్చించేందుకు అక్టోబర్‌ 12న బోర్డు సభ్యుల సమావేశం కానున్నారు.
భరత్‌ గేర్స్‌:- ప్రస్తుత షేర్‌హోల్డర్లకు రైట్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.15కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
గ్రాఫైట్‌ ఇండియా:- బెంగళూర్‌ యూనిట్‌లో కార్యక్రమాలను నిలిపివేసింది.
మాస్టేక్‌:- ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీ మాస్టేక్‌లో వాటా 5శాతానికి చేరింది.
స్కాన్‌ స్టీల్స్‌:- ‘‘వన్‌టైం సెటిల్‌మెంట్‌’’ పద్ధతిలో సెంట్రల్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌ల్లో రుణాలను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది.
మిల్లిటన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌:- షేర్ల కన్సాలిడేషన్‌కు అక్టోబర్‌ 23ను రికార్డు తేదిగా తేదిగా నిర్ణయించింది.
ఎంసీఎక్స్‌:- వ్యాపార లావాదేవీలను చర్చించేందుకు వలియెంట్‌ క్యాపిటల్‌ కంపెనీతో అక్టోబర్‌ 10న సమావేశాన్ని జరపనుంది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, బంధన్‌ బ్యాంక్‌, ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌.



You may be interested

హోండా నుంచి కొత్త ‘సీఆర్‌-వీ’

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: జపనీస్‌ ఆటోమేజర్‌ హోండా... సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. సీఆర్‌-వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్‌ డ్రైవ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.28.15 లక్షలు, డీజిల్‌ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించినట్లు హోండా కార్స్‌ ఇండియా సీఈఓ గకు నకనిషి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కస్టమర్లు

రూపీ రికవరీ

Wednesday 10th October 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.22 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ముగింపు 74.39తో పోలిస్తే 0.22 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 74.13 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 8.049 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 8.076 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ప్రస్తుత ఏడాది

Most from this category