STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 3rd October 2018
Markets_main1538540906.png-20806

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హోటల్‌ లీలా:- ఎల్‌ఐసీకి రూ.22.50 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది.
బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది.
ఎంఫసిస్‌:- షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.1350ల చొప్పున ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది.
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌:- రుణాల ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ఇష్యూను రద్దు చేసుకుంది.
పీసీ జూవెలరీస్‌:- కంపెనీ డైరెక్టర్‌గా సురేష్‌ కుమార్‌జైన్‌ నియమితులయ్యారు.
మిందా కార్పొరేషన్‌:- దేశీయంగా ఉన్న అనుబంధ సంస్థలన్నింటినీ ప్రధాన సంస్థలోకి విలీనం చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
కెన్‌ఫిన్‌ హోమ్స్‌:- కంపెనీ డైరెక్టర్‌గా ఎస్‌.ఏ.కదూర్‌ నియమితులయ్యారు.
కుపిడ్‌:- 1:2 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
7ఎన్‌ఆర్‌ రిటైల్‌:- బోనస్ షేర్ల ఇష్యూ ద్వారా కంపెనీ ఈక్విటీ షేర్ల వాటా పెరిగింది.
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీ తాత్కాలిక సెక్రటరీగా సుమిత్‌ గోయల్‌, సీఎఫ్‌ఓగా గిరీశ్‌ గుప్తా నియమితులయ్యారు.
గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- ఆర్థోపెడిక్‌ అండ్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ కోసం ట్రూనార్త్‌ కంపెనీతో కలిసి పనిచేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- లివిక్విక్‌ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
విప్రో:- ఇండియాలో డాటా నిర్వహణ కేంద్రాల ఉపసంహరణను పూర్తి చేసింది.



You may be interested

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌..

Wednesday 3rd October 2018

లాభాలతో ప్రారంభమై బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఇక నెగటివ్‌లో ప్రారంభమైన నిఫ్టీకి నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 9:51 సమయంలో సెన్సెక్స్‌ 210 పాయింట్ల నష్టంతో 36,315 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 10,931 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఒకానొక సమయంలో 280 పాయింట్లమేర క్షీణించింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,606-36,246 పాయింట్ల మధ్య, నిఫ్టీ 10,982-10,910 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. రూపాయి తొలిసారి అమెరికా

రూపీ @ 73.34

Wednesday 3rd October 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం తన జీవిత కాలంలోనే తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పతనమైంది. క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.28 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన సోమవారం ముగింపు 72.91తో పోలిస్తే 0.45 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 73.25 వద్ద ప్రారంభమైంది.

Most from this category