STOCKS

News


బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 20th March 2019
Markets_main1553056837.png-24700

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌:-
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల విలువ సెక్యూరిటైజేషన్ లావాదేవీ ప్రక్రియను పూర్తి చేసినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు సమాచారం ఇచ్చింది.
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బ్రిక్‌రేటింగ్‌ సంస్థ ఎన్‌సీడీలపై రేటింగ్‌ను పెంచింది. గతంలో తాము కేటాయించిన ఎఎ(నెగిటివ్‌) నుంచి ఎఎ(స్థిరత్వం)కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఓఎన్‌జీసీ:- మార్చి 23వ తేది నుంచి షేరు మధ్యంతర డివిడెండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. 
కాక్స్‌&కింగ్స్‌:- హంగేరీలోని 184 గదులతో మొదటి హోటల్‌ను ప్రారంభించింది.
వీ-మార్ట్‌ రిటైల్‌:- అస్సాంలోన కొత్త స్టోర్‌ను ప్రారంభించింది
బోధల్‌ కెమికల్స్‌:- గుజరాత్‌ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది
డీఎల్‌ఎఫ్‌:- గురుగ్రామ్‌లో జాయింట్‌వెంచర్‌లోని 33శాతం వాటాను హైన్స్ ఇంట్రెస్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి విక్రయించనుంది. 
జిందాల్‌ సా:- వ్యక్తిగత కారణాలతో కంపెనీ స్వతంత్ర డెరక్టర్‌ పదవికి దేవీ దయాళ్‌ రాజీనామా చేశారు. 
టాటాస్టీల్‌ బీఎస్‌ఎఎల్‌:- రూ.65వేల కోట్ల విలువైన నాన్‌-కన్వర్టబుల్‌ రీడమబుల్‌ ఫ్రిపరెన్ష్‌ ఈక్విటీ ఈక్వీటీ షేర్లను టాటా స్టీల్‌ కంపెనీకి విక్రయించింది. 
జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌:- లీజుదార్లకు అద్దె చెల్లించలేకపోవడంతో మరో 6 జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ నిలిపివేసింది. 
హిమాలయా ఫుడ్‌ ఇంటర్నేషనల్‌:- కంపెనీ మార్చి 25న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కన్షారియం బ్యాంకులకు మొత్తం రుణాన్ని వన్‌టైంసెటిల్‌మెంట్‌లో చెల్లించే అంశంపై చర్చించునుంది.
రాలీస్‌ ఇండియా:- సరుక రవాణా సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా అంకేలేశ్వర్ యూనిట్లో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు
కంపెనీ ప్రకటించింది. 
తల్వాల్కర్ బెటర్ వాల్యూ:- కంపెనీ ప్రమోటర్‌ ఒకరు 1శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను మార్చి 18న ఓపెన్‌ మార్కెట్‌ పద్దతిలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
భారతీ ఎయిర్‌టెల్‌:- సంస్థలో నెటెల్‌ ఇన్‌ఫ్రాకు అదనంగా 16.76 శాతం వాటాను బదిలీ చేసింది. 
ఐడీబీఐ బ్యాంక్‌:- వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా రూ.4వేల కోట్ల నిధులను సమీకరించే​యోచనలో ఉంది.
కోల్గేట్‌ పామోలివ్‌:- మార్చి 29న జరిగే బోర్డుమీటింగ్‌లో మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోనుంది. You may be interested

జెట్ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం

Wednesday 20th March 2019

- వాటాలు విక్రయించనున్న ఎతిహాద్‌ - ఏప్రిల్‌ 1 నుంచి సేవలు నిలిపేస్తామంటున్న పైలట్లు - గట్టెక్కించేందుకు రంగంలోకి కేంద్రం - నిధులు సమకూర్చాలని బ్యాంకులకు సూచన ముంబై:- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ కూడా ఏదో ఒక ధరకు వాటాలు విక్రయించేసి తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం

స్వల్పలాభాలతో ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Wednesday 20th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 38,434 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల పెరుగుదలతో 11,552 పాయింట్ల వద్ద మొదయల​య్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోకే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్ల చొప్పున నష్టాల్లోకి మళ్లాయి.

Most from this category