STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 30th November 2018
Markets_main1543551660.png-22500

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఎన్‌బీఎస్‌సీ షేర్లు:- ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య లభత్యను పెంచేందుకు ఆర్‌బీఐ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీల సెక్యూరిటైజేషన్ లావాదేవీల నిబంధనలను సవరించడంతో పాటు కనీస హోల్డింగ్‌ కాలపరిమితిని 5ఏళ్లకు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, భారత్‌ ఫైనాన్స్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ షేర్లలో ట్రేడింగ్‌లో కదలికలను గమనించివచ్చు.
స్పైస్‌ జెట్‌:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అజయ్‌సింగ్‌ నియమానికి షేర్‌హోల్లర్లు అనుమతి తెలిపారు.
టీసీఎస్‌:- అమెరికా కోర్టులో ఒక కేసుకు సంబంధించి టీసీఎస్‌కు అనుకూలంగా తీర్పు వెలువడినట్లు కంపెనీ తెలిపింది
ఏషియన్‌ ఆయిల్‌ఫీల్డ్‌ సర్వీసెస్‌:- ఓఎన్‌జీసీ కంపెనీ నుంచి రూ.30కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
ఐనాక్స్‌ లైసూర్‌:- ప్రమోటర్‌ సంస్థ గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌కు ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా ఓఎన్‌జీసీకి  64 లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.250 చొప్పున మొత్తం రూ.160 కోట్లను సమీకరించింది.
మోనోటైప్‌ ఇండియా:- కంపెనీ డైరెక్టర్‌గా హరిష్‌ జైన్‌ రాజీమానాకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన స్థానంలో నరేష్‌ జైన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
వోడాఫోన్‌ ఇండియా:- రూ.6వేల కోట్ల విలువైన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లపై రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే వాణిజ్య పేపర్లపై రేటింగ్‌ను సైతం సవరించింది.
ఎస్‌బీఐ:- ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4శాతం వాటా విక్రయానికి ఎస్‌బీఐ ఆమోదం తెలిపింది. రెండు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కు 4శాతం వాటాను సమానమైన 86.2లక్షల ఈక్విటీ షేర్లను రూ.482 కోట్లకు విక్రయించేందుకు ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ కంపెనీ ఆమోదం తెలిపింది.
ఫ్యూచర్‌ రీటైల్‌:- భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ... ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌లో లావాదేవీల్లో భాగంగా రిటైల్‌ ఫ్యూచర్‌కు చెందిన 1.13శాతం వాటాకు సమానమైన 57లక్షల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లకు ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌నకు విక్రయించింది.



You may be interested

మరింత బలపడిన రూపీ

Friday 30th November 2018

ఇండియన్‌ రూపాయి లాభాల ఇన్నింగ్స్‌ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.18 శాతం పెరుగుదలతో 69.72 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ 10 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. రూపాయి గురువారం ముగింపు స్థాయి 69.85గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.69 వద్ద ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 30th November 2018

10,900 పైన ట్రేడవుతోన్న నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ పెరిగింది. శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,858 పాయింట్లతో పోలిస్తే 34 పాయింట్ల లాభంతో 10,892 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,170 పాయింట్లతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 36,304 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,900 మార్క్‌ను అధిగమించింది.  దేశ ఆర్థిక వ్యవస్థ

Most from this category