STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th October 2018
Markets_main1540872943.png-21572

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే కొన్ని షేర్ల వివరాలు
టాటా పవర్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో కంపెనీ రూ.5,500 కోట్ల ఎన్‌సీడీల జారీకి ఆమోదం తెలిపింది.
కెడిల్లా హెల్త్‌కేర్:- ఈక్విటీ షేర్ల రూపంలో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 51శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియతో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ... కెడిల్లా హెల్త్‌కేర్‌ అనుబంధ సంస్థగా మారనుంది.
సన్‌టెక్‌ రియల్టీ:- రూ.25 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూను జారీ చేసింది.
మిండా కార్పోరేషన్‌:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ధీర్ఘకాలికానికి గానూ కంపెనీ రేటింగ్‌ను ఎ(+)నుంచి ఎఎ(-)కు సవరించింది.
షుగర్స్‌ సిమెంట్స్‌:- కంపెనీ జాయింట్‌ మేనేజర్‌గా డాక్టర్‌ ఎస్‌. అనంద్‌ రెడ్డి నియమితులయ్యారు.
భారతీ ఎయిర్టెల్‌:- ఇటీవల ఐపీఓ ప్రక్రియపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసింది. కంపెనీ ఖచ్చితంగా ఐపీఓకు వస్తుందని, అందుకు బోర్డు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారని కంపెనీ స్పష్టం చేసింది.
తాన్లా సెల్యూషన్స్‌:- కంపెనీ సీనియర్‌ అడ్వైజర్‌ అండ్‌ మెంటర్‌గా ఎయిర్‌టెల్‌ మాజీ సీఈవో సం‍జయ్‌ కపూర్‌ నియమితులయ్యారు.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- టెక్‌ మహీంద్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌, ఏబిబి ఇండియా, ఐడీఎఫ్‌సీ, ఇన్ఫో ఎడ్జ్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలపర్స్‌, జేకే టైర్స్‌, అలెంబిక్‌ ఫార్మా, బ్లూస్టార్‌, గంగోత్రి టెక్స్‌టైల్స్‌, కమ్మిన్‌ ఇండియా, భూషణ్‌ స్టీల్‌, రామ్‌కో సిమెంట్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, ఇమామి, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌, యూనికెమ్‌ ల్యాబ్స్‌, కళ్యాణి ఫోర్జ్స్‌, నవీన్ ఫ్లోరిన్‌, శ్రీ రేణుకా షుగర్స్‌, భారత్‌ గేర్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, టాటా టెలీసర్వీసెస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బిర్లా కార్పోరేషన్‌, జేవిఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌, ఎంకాయ్‌ గ్లోబల్‌ ఫైనాన్షియల్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, టోరెంట్‌ పవర్‌, వెలస్పాన్‌ కార్పోరేషన్‌, 3ఎం ఇండియా.You may be interested

స్థిరంగా పసిడి ధర

Tuesday 30th October 2018

డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలర్లు లాభంతో 1,228.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టిందనే కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ క్రమంగా పుంజుకుంటోంది. నేడు డాలర్‌

ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Tuesday 30th October 2018

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణించినప్పటికీ, మంగళవారం భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల పెరుగుదలతో 34,069 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,239 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారత్‌ మార్కెట్‌ 2 శాతంపైగా ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా వేదాంత, హిందాల్కో, గెయిల్‌, టాటా మోటార్స్‌ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండగా, పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలు

Most from this category