STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 8th August 2018
Markets_main1533703837.png-19031

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- రేయాల్ట్రిస్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
టాటా టెలీసర్వీసెస్‌:- రూ.20వేల కోట్ల నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఆగస్ట్‌ 10న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
పాటిల్‌ ఇంజనీరింగ్స్‌:- రూ.1793.5కోట్ల విలువైన రెండు హైడ్రో ప్రాజెక్ట్స్‌లతో పాటు రూ.618.21 కోట్ల టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ.2411.26 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
జీఓసీఎల్‌:- సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి రెండేళ్ల పాటు పేలుడు పదార్థాల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.203.09 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
ధనలక్ష్మీ బ్యాంకు:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు ఆగస్ట్‌ 08 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎస్‌ఆర్‌ఎఫ్‌:- కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ను సిఫారసు చేసిందిజ
వేదాంతా:- ఓఏఎల్‌పీ వేలంలో 40 చమురు బ్లాకులు దక్కాయని ప్రకటించింది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ:- డిబెంచర్లు, బాండ్లు షేర్ల జారీ ద్వారా రూ.15వేల కోట్ల నిధులను సమీకరించడానికి వాటాదార్ల అనుమతి పొందింది.
ఎల్‌ అండ్‌ టీ:- పలు వ్యాపార విభాగాల్లో రూ.1904 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
నేడు క్యూ1 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలు:-
బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, సిప్లా, లుపిన్‌, ఇండియన్‌ బ్యాంక్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, నాల్కో, నాట్కో ఫార్మా, ఎన్‌ఎమ్‌డీసీ, ఎన్‌డీటీవీ, థెర్మాక్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, సీమెన్స్‌, ట్రెంట్‌, బీఈఎమ్‌ఎల్‌, బ్లూస్టార్‌, ఈఐడీ ప్యారీ(ఇండియా), గుడ్‌ ఇయర్‌ ఇండియా, ​‍ గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్‌, ఇగార్షి మోటార్స్‌, యూఫో మూవీజ్‌ ఇండియా, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, బాంబే బర్మా ట్రేడింగ్‌ కార్పొ, ఇమామి ఇన్‌ఫ్రా, హికాల్‌, క్విక్‌ హీల్‌, ఇండియన్‌ బ్యాంకు, హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్చన్‌ కంపెనీ, సిటీ యూనియన్‌ బ్యాంకు, నాట్కో ఫార్మా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, మిండా ఇండస్ట్రీస్‌, ఫోనిక్స్‌ మిల్స్‌, ఫ్యూచర్స్‌ కన్జ్యూమర్‌, ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌, శ్రీ రేణుకా షుగర్స్‌, అపోలో పైప్స్‌.You may be interested

3వ వారంలో జైట్లీ తిరిగి  బాధ్యతలు!

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఈ నెల 3వ వారం నుంచీ తిరిగి  బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను పురస్కరించుకుని ఏప్రిల్‌ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్‌ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే,

20 యేళ్ల తర్వాత ‘క్యాడ్‌’ గుప్పిట్లోకి చైనా!

Wednesday 8th August 2018

బీజింగ్‌: ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- సీఏడీ) సమస్యలోకి జారింది. 2018 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్‌) 28.3 బిలియన్‌ డాలర్ల క్యాడ్‌ను నమోదు చేసింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం,  చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ఈ పరిణామానికి నేపథ్యం. ఆరు నెలల కాలాన్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత క్యాడ్‌

Most from this category