News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 3rd January 2019
Markets_main1546491575.png-23377

వివిధ వార్తల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌య్యే షేర్లు ఇవి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్రం క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్‌ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1000 షేర్లుకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్‌ విషయానికొస్తే..  ప్రతి 1000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ:- జ‌న‌వ‌రి 29న ఎన్‌సీడీల ద్వారా రూ.45వేల కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది.
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- డిసెంబ‌ర్‌లో కొత్తగా 1.05 కోట్ల డ‌ పెంచుకుంది.
వోడాఫోన్ ఇండియా:- డిసెంబ‌ర్‌లో 73.6 ల‌క్షల స‌బ్ స్క్రైబ‌ర్లని కోల్పోయింది.
భార‌తీ ఎయిర్‌టెల్‌:-  డిసెంబ‌ర్లో 18.6ల‌క్షల స‌బ్ స్క్రైబ‌ర్లు త‌గ్గారు.
సిండికేట్ బ్యాంక్‌:- ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా కంపెనీ రూ.500 కోట్ల‌ను స‌మీక‌ర‌ణకు సిద్ధమైంది.
ఈక్విటాస్‌ హోల్డింగ్‌:- ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ సేవింగ్స్‌లపై వడ్డీరేట్లను 7.5శాతానికి పెంచింది.
ఆర్‌బీఎల్‌:- పంకజ్‌ శర్మ సీఓఓ(ఛీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌)గా రాజీనామా చేశారు.
జేఎస్‌పీఎల్‌:- స్టీల్‌ వ్యాపార సీఈవోగా సుదన్స్‌ సరాఫ్‌గా నియమితులయ్యారు.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- బాసెల్‌-III బాండ్ల జారీ ద్వారా కంపెనీ రూ.1285 కోట్ల సమీకరించనుంది. ఈ మేరకు తమ డైరెకర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
అశోక్‌లేలాండ్‌:- ఆష్లే ఏవియేష్‌లో వాటాను పెంచుకుంది.
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- విదేశీ వాణిజ్య రుణాల ద్వారా కంపెనీ రూ.1853 కోట్లు సమీకరించింది.

ఎన్‌సీసీ:- నిర్మాణ రంగ కంపెనీ ఎన్‌సీసీ డిసెంబర్‌లో రూ.2891 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.



You may be interested

మరో మెగా బ్యాంక్‌ రెడీ..!

Thursday 3rd January 2019

బీవోబీలో విజయా, దేనా విలీనానికి క్యాబినెట్ ఆమోదం - మూడో అతి పెద్ద బ్యాంక్‌ ఏర్పాటు - ఏప్రిల్‌ 1 నుంచి కార్యకలాపాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్రం క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్‌ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని

నష్టాల ప్రారంభం​

Thursday 3rd January 2019

ప్రపంచమార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు చైనా ఉత్పాదక రంగం మందగించడంతో ఈ తొలిత్రైమాసికంలో తమ ఐఫోన్‌ మోడళ్ల ఉత్పత్తులను తగ్గిస్తున్నట్లు ఆపిల్‌ ప్రకటనతో ఆసియా మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. జపాన్‌ మార్కెట్‌ నేడు కూడా సెలవులో ఉంది. అయితే ఈ దేశ కరెన్సీ యెన్‌ ర్యాలీ చేయడంతో నికాయ్‌ ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌

Most from this category