STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు..!

Thursday 6th September 2018
Markets_main1536208527.png-19993

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
అరంబిందో ఫార్మా:- అమెరికాలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు సండోజ్‌ కంపెనీ నుంచి 3 యూనిట్లను 900 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.
బాంబే బుర్హాన్‌ ట్రేడింగ్‌:- కంపెనీ సీఈఓగా దీబర్‌ ఛటర్జీ నియమితులయ్యారు.
పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- వేరువేరు క్లయింట్ల నుంచి రూ.226.07 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
భారతీ ఎయిర్‌టెల్‌:- తన అనుబంధ సంస్థ భారతీ టెలీ మీడియాలో వార్‌బర్గ్‌ సంస్థకు 20 వాటా విక్రయ ప్రక్రియను పూర్తి చేసింది.
మారుతి సుజుకీ:- ఆగస్ట్‌లో మొత్తం 6.9శాతం ఉత్పత్తి పెరిగింది. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,57,863 యూనిట్లను ఉత్పత్తి చేయగా, ఈ ఆగస్ట్‌లో మొత్తం 1,68,725 యూనిట్లను ఉత్పత్తి చేసింది.
కర్ణాటక బ్యాంక్‌:- మూలధన నిధులను పెంచుకునేందుకు రూ.800కోట్ల విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ బాండ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
పెర్సిస్టెంట్ సిస్టమ్స్:- హెరాల్డ్‌ హెల్త్‌కేర్‌ను సొంతం చేసుకుంది.
రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్స్‌ కార్పోరేషన్‌:- సెప్టెంబర్‌ 14న కంపెనీ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
క్వెస్‌ కార్ప్‌:- హెప్టాగాన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 3శాతం వాటాను కొనుగోలు చేసింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- రోహిత్‌ కుమార్‌ గుప్తా కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.
ఇగరశి మోటర్స్‌ ఇండియా:- బోనస్‌ షేర్ల ఇష్యూకు సెప్టెంబర్‌ 28ని రికార్డు తేదిగా నిర్ణయించారు.
సాగర్‌ సిమెంట్స్‌:- ఆగస్ట్‌లో సిమెంట్‌ అమ్మకాలు 24శాతం పెరిగాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,99,179 మెగా టన్నులను విక్రయించగా, ఈ ఆగస్ట్‌లో 2,47,051  మెగా టన్నుల సిమెంట్‌ను విక్రయించింది.
జిందాల్‌ స్లెయిన్‌లెస్‌ స్టీల్‌:- సెప్టెంబర్‌ 27న వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
వెలస్పాన్‌ కార్పోరేషన్‌:- తన అనుబంధ సంస్థ వెల్‌స్పాన్‌ పైప్స్‌ కంపెనీని విలీనం చేసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌:- ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ.350 కోట్లను సమీకరించింది.
ఎల్‌అండ్‌టీ:- తన అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ నుంచి 6.08శాతం వాటాను విక్రయించింది.
అలెంబిక్‌ ఫార్మా:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఈ సెప్టెంబర్‌ 10న కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరగనుంది.You may be interested

రుణ రేట్లను పెంచిన బీవోబీ

Thursday 6th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అన్ని రకాల కాల వ్యవధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం మేర పెంచింది. ఇది ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.50 శాతం నుంచి 8.55 శాతం అయింది. పెంపు అనంతరం ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.40 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.20 శాతానికి చేరాయి. గత

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న రూపాయి

Thursday 6th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం లాభాలతో ప్రారంభమైంది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71.76తో పోలిస్తే 0.01 శాతం బలపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 71.65 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.036 శాతంగా ఉంది.

Most from this category