News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 26th February 2019
Markets_main1551152580.png-24327

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
ఎమ్‌కో:-
కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా సంజ‌య్ భ‌గ‌త్‌న‌గ‌ర్ రాజీనామా చేశారు. 
లుపిన్‌:- కీళ్ల నొప్పుల నివార‌ణ చికిత్సలో వినియోగించే ప్రేడ్నిసోలోన్ ఔష‌ధ విక్రయాల‌న‌కు యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది. 
మాస్తెక్‌:-  కంపెనీ షేర్ల‌ను ఐడీఎఫ్‌సీ ఏఎంసీ లిమిటెడ్ కొనుగోలు చేసింది.  వాటా కొనుగోలుతో కంపెనీలో మొత్తం వాటా 5.02శాతానికి చేరుకుంది. 
హెచ్ఐఎల్‌:- రూ.276 కోట్ల విలువైన రుణ‌సదుపాయానికి ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ సంస్థ ఎఎ- రేటింగ్‌ను కేటాయించింది.
ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌:- రూ.50.50 కోట్ల విలువైన అన్‌సెక్యూర్డ్ రీడ‌మ‌బుల్ నాన్‌క‌న్వర్టబుల్ బాండ్ల రేటింగ్‌ను బిబిబి(-) నుంచి బిబిబి(+)కు స‌వ‌రించింది. 
హైటెక్ గేర్స్‌:- కంపెనీ చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా విజ‌య్ మ‌తూర్ రాజీనామా చేశారు. అయితే కంపెనీ సీనియ‌ర్ జ‌న‌ర‌ల్ మేన‌జ‌ర్‌గా కొనసాగుతారని తెలిపింది. 
కార్పోరేష‌న్ బ్యాంక్‌:- వివిధ మార్గాల్లో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.12500 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. 
శ్రద్ధా మోట‌ర్స్ ఇండ‌స్ట్రీస్‌:- ఇండియాలో బీఎస్‌-4  వాహనాల‌ను త‌యారీకి జపాన్‌కు చెందిన ఎవర్స్పాచేర్ ఎగ్సాస్ట్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ కంపెనీతో క‌లిసి భాగ‌స్వామ్య కంపెనీ ఏర్పాటు చేసింది. 
తేజాస్ నెట్‌వ‌ర్క్స్ :- బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో కంపెనీ మొట్టమొదటిగా అల్ట్రా-కన్వర్టెడ్ బ్రాడ్ బ్యాండ్ ఉత్పత్తిని ఆవిష్కరించింది.
నేడు క్యూ3 ఫలితాల‌ను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- రిచా ఇండ‌స్ట్రీస్‌, స‌నోఫి ఇండియా,  శైల‌జా క‌మ‌ర్షియ‌ల్‌You may be interested

బోర్డర్‌ టెన్షన్‌ : భారీ నష్టాలతో ప్రారంభం

Tuesday 26th February 2019

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రికత్త వాతవరణం నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ మంగవారం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 35 వేల దిగువున 35,975.75 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10800 దిగువున 10,775 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి చొచ్చుకుపోయిందని వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌లోకి జొరంబడేందుకు ప్రయత్నించిన భారత్‌

భారీ నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019

భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఉద్రికత్త వాతవరణానికి తోడు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో మంగళవారం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ తీవ్ర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.8:45లకు ఇండెక్స్‌ 83.50 పాయింట్ల భారీ నష్టంతో 10809.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి  10887.05 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత వైమానిక

Most from this category