STOCKS

News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 26th March 2019
Markets_main1553574482.png-24795

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌:-
ఎన్‌సీడీల ద్వారా రూ.600 కోట్లను సమీకరించింది. 
టైటాన్‌ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డెరెక్టరుగా ప్రద్యుమ్న రమేష్‌చంద్ర వ్యాస్‌ను నియమించారు. 
డీసీఎం:- కంపెనీ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్షియల్‌ పదవికి సుమంత్‌ భరత్‌రామ్‌ రాజీనామా చేశారు. మార్చి 31వ తేది నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. 
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్:- సంస్థలో తన జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ప్రిడెన్షియల్‌ కార్ప్‌ హోల్డింగ్‌ కంపెనీలో 3.71శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో జరిగే ఈ వాటా విక్రయం ద్వారా కంపెనీ మొత్తం రూ.1600 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా షేరు ఫ్లోర్‌ ధరను రూ.300లుగా నిర్ణయించింది. 
సుజ్లాన్‌ ఎనర్జీ:- పవన&సోలార్ విదుచ్ఛక్తి  అనుబంధ సం‍స్థలకు విక్రయించింది. 
యూకో బ్యాంక్‌:- రూ.175 కోట్ల విలువైన షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. 
కల్పతరు పవర్‌:- స్వీడిష్‌ ఈపీసీ కంపెనీలో 85శాతం వాటాను 24 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 
ఫ్యూచర్‌ రిటైల్‌:- కిశోర్‌ బియానీని తిరిగి ఎండీగా నియమించడానికి తెలిపింది. 
ప్రభాత్‌ డెయిరీ:- తన డెయిరీ వ్యాపారాన్ని విక్రయించడానికి సీసీఐ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
సుజ్లాన్‌ ఎనర్జీ:- రెండు అనుబంధ సంస్థల్లో వాటాను రూ.99.1 కోట్లకు విక్రయించింది. 
డీఎల్‌ఎఫ్:- క్యూఐపీ ఇష్యూ నిన్న ప్రారంభమైంది. ఎల్లుండితో ముగియనున్న ఇష్యూ, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.193.01లుగా కంపెనీ నిర్ణయించింది. 
వరుణ్‌ బేవరేజెస్‌:- పెప్పికో ఫ్రాంఛైజీ హక్కుల కొనుగోలుకు సీసీఐ అనుమతులు దక్కించుకుంది. 
హోటల్‌ లీలావెంచర్‌:- బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు 4 హోటళ్లు, ఇతర ఆస్తులను రూ.3950 కోట్లకు విక్రయించడానికి వాటాదారుల  అనుమతి కోరింది. 
లుపిన్‌:- అమెరికా మార్కెట్‌లో వయాగ్రా ట్యాబ్లెట్ల జనరిక్‌ వెర్షన్‌ విక్రయానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.  
సన్‌ఫార్మా:- గుజరాత్‌లోని బస్కా తయారీ ప్లాంట్‌పై ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ యూఎస్‌ఎఫ్‌డీ ఫార్‌- 483ను జారీ చేసింది.You may be interested

పసిడి....నెల గరిష్టం నుంచి వెనక్కి

Tuesday 26th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర నెలరోజుల గరిష్టం నుంచి వెనక్కి     వస్తోంది. ఆసియా మార్కెట్లో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్ల నష్టపోయింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,328.35 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా రికవరీ బాట పట్టడంతో పాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ పెరగడం పసిడి ర్యాలీకి అవరోధాలుగా నిలిచాయి. ఆర్థిక మాంద్య ఆందోళన భయాల నుంచి

స్వల్పలాభాలతో ప్రారంభం

Tuesday 26th March 2019

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలతో క్రితం రోజు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ సూచీలు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 37,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,375 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో తిరిగి పీఎస్‌యూ షేర్లే జంప్‌చేసాయి. ఐఓసీ 3 శాతంపైగా పెరగ్గా, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రోలు 2-3 శాతం మధ్య

Most from this category