News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 31st January 2019
Markets_main1548905857.png-23908

వివిధ కంపెనీల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
ఎల్ఎఫ్ ట్రాన్స్‌పోర్టేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌:- ద్రవ్యకొర‌త కార‌ణంగా డిబెంచర్‌ హోల్డర్లకు జనవరి 30న ఎన్‌సీడీలపై వ‌డ్డీని చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంది.
అజంతా ఫార్మా:- బై బ్యాక్ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధ‌ర రూ.1300ల చొప్పున మొత్తం 7.70ల‌క్షల ఈక్వీటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయ‌నుంది. ఇందుకు రికార్డు తేదిగా ఫిబ్రవ‌రి 12గా నిర్ణయించింది.  
కేడిల్లా హెల్త్‌కేర్‌:- త‌న అనుబంధ సంస్థ జైడ‌స్ వెల్‌నెస్ జ‌త క‌ట్టి క్యాపిట‌ల్ ఆఫ్ హింజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం వాటాను సొంతం చేసుకుంది.
జైడ‌స్ వెల్‌నెస్‌:- కంపెనీ సీఈవో, శాశ్వత కాల డైరెక్టర్ ప‌ద‌వికి త‌రుణ్ జీ. ఆరోరా ఎన్నిక‌య్యారు.
శేర్వాని ఇండస్ట్రీ సిండికేట్:- ; టెండ‌ర్ ఆఫ‌ర్ ద్వారా ప్రపోర్షనేట్‌ పద్దతిలో షేర్ హోల్డర్ల నుంచి సాధార‌ణ షేర్లను తిరిగే చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
భార‌తీ ఎయిర్‌టెల్‌:- ఎయిర్‌టెల్ ఆఫ్రికాలో 200మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఖ‌త‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆథారిటీతో  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా రుణ భారాన్ని త‌గ్గించుకునేందుకు ఈ నిధులని వినియోగించాల‌ని కంపెనీ యోచిస్తుంది.
నేడు క్యూ3 ఫ‌లితాలను ప్రక‌టించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
భార‌తీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, వేదాంత‌, యూపీఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్‌, డాబ‌ర్ ఇండియా, ఓరియంట‌ల్ కార్బన్ కెమిక‌ల్స్‌, సెన్‌నెట్ ఇండ‌స్ట్రీస్‌, లార్సన్ ల్యాబ్స్‌, అపోలో మైక్రో సిస్టమ్స్‌, శ్రీ‌కాళ‌హ‌స్తి పైప్స్‌, టోక్యో ప్లాంట్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, సుంద‌రం ఫైనాన్స్‌, సోలార్ ఇండ‌స్ట్రీస్ ఇండియా, సుజ్లాన్ ఎక్సోప్లోరేష‌న్ టెక్నాల‌జీస్‌, డాటామెస్టిక్ గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌, వీ-గార్డ్ ఇండ‌స్ట్రీస్‌, టీసీఐ ఫైనాన్స్‌, దేనా బ్యాంక్‌, టీడీ ప‌వ‌ర్ సిస్టమ్స్‌, జామ్నా అటో, మార‌ల్ ఓవ‌ర్సీసెస్‌, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, జేబీఎఫ్ ఇండ‌స్ట్రీస్‌, ఎన్ఎండీసీ, ఐఎఫ్‌బీ ఇండ‌స్ట్రీస్‌, ఎస్సార్ షిప్పింగ్, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ, బ‌ల్లాపూర్ ఇండ‌స్ట్రీస్‌, చంబ‌ల్ ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్‌, మాగ్మా ఫిన్ కార్ప్‌, ఎల్ జీ బాల‌క్రిష్ణ అండ్ బ్రో, ఇమామి, గుజరాత్ ఆల్కేమ్ అండ్ కెమికల్స్‌.You may be interested

చందా కొచర్‌ దోషే!!

Thursday 31st January 2019

నిబంధనలు ఉల్లంఘించిన మాట నిజమే తేల్చిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఆమెను తొలగించినట్లే పరిగణిస్తాం ఇచ్చిన బోనస్‌లన్నీ వెనక్కి తీసుకుంటాం ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడి న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ బుధవారం ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్‌ ఇప్పటికే

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 76 పాయింట్లు అప్‌

Thursday 31st January 2019

వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వెనకడుగువేయడంతో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10719 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,643 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది

Most from this category