News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 10th June 2019
Markets_main1560142203.png-26188

వివిధ వార్తలకు అనుగుణంగా ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎస్‌బీఐ:-
 జూన్‌ 1 నుంచి సవరించిన రెపోరేటును గృహరుణాలకు బదలాయించనుంది. 
హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను యధాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. 
భారత్‌ ఫోర్జ్‌:- జర్మన్‌ కంపెనీ రెఫ్‌ ఎలక్ట్రానిక్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జాయింట్‌లో భారత్‌ ఫోర్జ్‌ మొత్తం వాటా 50శాతంగా ఉంటుంది. 
మెయిల్‌:- మధ్యప్రదేశ్‌లోని యుక్వా మైన్‌లో పనులు ప్రారంభించేందుకు ఎన్విరాల్‌మెంట్‌ క్లియరెన్స్‌ దక్కించుకుంద.ఇ 
ఎల్‌ అండ్‌ టీ:- మైండ్‌ ట్రీలో 5.13శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి షేరు ధర రూ. 980లుగా నిర్ణయించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ జూన్‌ 17న ప్రారంభమై, జూన్‌ 28న ముగిస్తుంది.
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌:- నిబంధనల ఉల్లఘన కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2 కోట్ల జరిమానా విధించింది. 
రిలయన్స్‌ పవర్‌:- డిబెంచర్లను జారీ ద్వారా నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌:- మధ్యంతర సీఎండీగా ఆర్‌కే చిబ్బర్‌ నియమితులయ్యారు. 
అదాని పోర్ట్స్‌:- షేర్ల బై బ్యాక్‌కు ఈనెల 21 తేదీని రికార్డ్‌ తేదిగా నిర్ణయించింది. 
కేపీఆర్‌ మిల్‌:- జూన్‌ 19ని షేర్ల బై బ్యాంక్‌ రికార్డు తేదిగా ప్రకటించింది. 
శ్రేయీ ఇన్‌ఫ్రా:- వ్యాపార అవసరాల నిమిత్తం పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేసింది. 
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర :- వివిధ రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటును 5-10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. 
మణప్పురం ఫైనాన్స్‌:- మే 29న సెబీ నుంచి షోకాజ్‌ నోటీసును అందుకున్నట్టు తెలిపింది.You may be interested

పసిడిలో లాభాల స్వీకరణ

Monday 10th June 2019

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నేడు ఆసియాలో 15డాలర్లు నష్టపోయి 1331 డాలర్ల కనిష్టస్థాయికి పతనమైంది. నేడు చైనా విడుదల చేసిన బలమైన వాణిజ్య మిగులు గణాంకాలు, అమెరికా - మెక్సికోల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతుండటంతో ఇన్వెస్టర్లు  నేడు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. క్రితం వారం ట్రేడింగ్‌లో పసిడి ధర 14నెలల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 10th June 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 316 పాయింట్ల పెరుగుదలతో 39,930 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,963 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంత షేర్లు 2 శాతం వరకూ ప్రారంభలాభాల్ని ఆర్జించగా, ఐఓసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎం అండ్‌ ఎంలు స్వల్పంగా నష్టపోయాయి. 

Most from this category