STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th September 2018
Markets_main1537245672.png-20342

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌లోని దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. మూడు బ్యాంకుల విలీనాన్ని 4-6 ఆరునెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఓఎఫ్‌సీ టెక్నాలజీస్‌:- 10:6 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎన్‌టీపీసీ:- టెల్చల్‌ థర్మల్‌ పవర్ ప్రాజెక్ట్‌లో రూ.9785.79 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- రూ.20 కోట్ల విలువ వాణిజ్య పేపర్ల జారీ ఇష్యూను జారీ చేసింది.
స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌:- జూలై 2020నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫైబర్‌మార్కెట్లో 10శాతం వాటాను కలిగిఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది.
జీసీపీఎల్‌:- బోనస్‌ షేర్ల కేటాయింపునుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌:- వినియోగదారుల సౌకర్యార్థం కొత్తగా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది.
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌:- ఇక్రా దీర్ఘకాలిక రేటింగ్‌ పెంచింది.



You may be interested

మరో మెగా బ్యాంకు

Tuesday 18th September 2018

మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలోకి దేనా, విజయా బ్యాంకు ఆరు నెలల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని అంచనా దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భావం.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.5 శాతం డౌన్‌

Tuesday 18th September 2018

మూడు ప్రభుత్వ రంగ విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 1.5 శాతం పతనమయ్యింది. 12 షేర్లు కలిగిన ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం పతమయ్యింది. ఈ షేరు ఇంట్రాడేలో 52 వారాల కనిష్టస్థాయి రూ. 166 స్థాయిని తాకింది. ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ షేర్లు 3.5 శాతం మేర క్షీణించాయి. పంజాబ్‌

Most from this category