STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 22nd March 2019
Markets_main1553227792.png-24742

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌య్యే షేర్ల వివ‌రాలు
ది ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా:‍ ‍‍‍-
కంపెనీ  అనుబంధ సంస్థ  ఐటిఐ రీ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్ త‌న షేరు హోల్డర్ల నుంచి రూ.10లు ముఖ విలువ క‌లిగిన 5.43ల‌క్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 
మైండ్ ట్రీ:- షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ నెల 26న మరోసారి బోర్డు సమావేశాన్ని జరపనున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.  
పిర‌మిల్ ఎంట‌ర్ ప్రైజెస్‌:-  రూ.10ముఖవిలువ క‌లిగిన మొత్తం 3500 డిబెంచ‌ర్లను తిరిగి కొనుగోలు చేసింది. 
అదానీ ట్రాన్స్‌మిష‌న్స్‌:- ఎగ్జిస్టింగ్ డిబెంచ‌ర్ హోల్డర్ల నుంచి 10,000 నాన్‌క‌న్వర్ట‌బుల్ డిబెంచ‌ర్లను బై బ్యాక్ ఆఫ‌ర్ ద్వారా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. వివిథ విడత‌ల ద్వారా జ‌రిగే ఈ బై బ్యాక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1000 కోట్ల స‌మీక‌ర‌ణ ల‌క్ష్యంగా పెట్టుకుంది.  
గ్రీన్లామ్ ఇండ‌స్ట్రీస్‌:- ల్యామినేష‌న్ షీట్ల ఉత్పత్తిని ఏడాదికి అద‌నంగా 1.6 మిలియ‌న్ ట‌న్నుల పెంచనుంది.
స‌న్ టీవీ నెట్‌వ‌ర్క్స్‌:-  కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు, అద‌న‌పు డైరెక్టరుగా ఆర్ మ‌హేశ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా క‌వియా క‌ళానిధి మార‌న్‌,  శ్రీధర్ వెంక‌టేష్‌, హేమంత్‌లు అద‌న‌పు స్వతంత్ర డైరెక్టర్లుగా నియ‌మితుల‌య్యారు. 
ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌:- అస్సెట్ రీక‌న్‌స్ట్రక్షన్ కంపెనీ చెందిన 8.37శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది. 
భాష్‌:- ప్రెట్టెల్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క‌లిసి భాగ‌స్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేసింది. 
ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌, ఆర్ ఈ సీలో 52.63శాతం వాటాను రూ.14500 కోట్లకు కొనుగోలు  చేసింది. 
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్:- రిల‌య‌న్స్ నావీ ముంబై ఇన్ఫ్రా లిమిటెడ్‌లో రూ. 50 కోట్ల పెట్టబ‌డులు పెట్టింది. 
భెల్‌:- ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో రెండో మ‌ధ్యంత‌ర డివిడెండ్ చెల్లింపున‌కు బోర్డు ఆమోదం తెలిపింది.  రూ.10లు ముఖవిలువ క‌లిగిన ప్రతి షేరుకు రూ. 4.50ల డివిడెండ్‌ను చెల్లించ‌నుంది. 
మణిప్పురం ఫైనాన్స్‌:- త‌న అనుబంధ సంస్థ  మ‌ణిప్పురం కాంపెటెక్ & కన్సల్టెంట్స్ లిమిటెడ్ లో మొత్తం వాటాను కొనుగోలు చేసింది. 
సుప్రజీత్ ఇంజ‌నీరింగ్‌:- సుప్రియఅజిత్ ఫ్యామిలీ ట్రస్ట్ కంపెనీలో 38శాతం  వాటాను కొనుగోలు చేశారు. 
జెట్ ఏయిర్‌వేస్‌:-  కంపెనీ త‌క్షణ‌మే 10శాతం  త‌గ్గించుకోవాల‌ని ప్రమోట‌ర్ న‌రేశ్ గోయ‌ల్‌ను బ్యాంకులు కోరాయి. 
డెబీ రియ‌ల్టీ:- ప్రమోట‌ర్ ఒక‌రు త‌న‌ఖాలో ఉంచిన 2.2  కోట్ల ఈక్విటీ షేర్లను విడిపించుకున్నారు. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యాండా ప్రెగాబలిన్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
హడ్కో:-  విదేశాల్లో రూ.5వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.You may be interested

పసిడిలో లాభాల స్వీకరణ

Friday 22nd March 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పసిడి ధర ప్రపంచ మార్కెట్లో 3వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. అయితే ఈ ఏడాదిలో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ సంకేతాలు పసిడి మద్దతునిస్తున్నాయి. కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ యధాతధ పాలసీ విధాన ప్రకటన తర్వాత అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడాది కనిష్టానికి, డాలర్‌ ఇండెక్స్‌ 6వారాల కనిష్టానికి క్షీణించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 20డాలర్లు లాభపడి

పాజిటివ్‌ ప్రారంభం

Friday 22nd March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,452 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో 11,549 పాయింట్ల వద్ద మొదలయ్యింది.   ఈ ఏడాది రేట్ల పెంపు వుండబోదని ఫెడ్‌ బుధవారంనాటి సమీక్ష అనంతరం సంకేతాలు

Most from this category