STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 10th September 2018
Markets_main1536552623.png-20105

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
యాక్సి్స్‌ బ్యాంక్‌:- కొత్త ఎండీ&సీఈవోగా అమితాబ్‌ చౌదరి నియమాకం ఖరారైంది. జనవరి 1న నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌:- కొత్త ఎండీ&సీఈవో నియమాకంపై సెప్టెంబర్‌ 12న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- సంస్థ స్వతంత్య్ర డైరెక్టర్‌గా శరత్‌ శర్మ నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
సోరెల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- వ్యాపార విస్తరణ, భవిష్యత్‌ వ్యాపార ప్రణాళికల అమలు కొరకు అవసరమయ్యే నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌:- డిబెంచర్ల జారీ అంశానికి రేటింగ్‌ సంస్థ ఇక్రా డౌన్‌ గ్రేడింగ్‌ను కేటాయించింది.
ఎన్‌ఎండీసీ:- ఆస్ట్రేలియాలో టంగ్‌స్టన్‌ అన్వేషణకు అనుమతులు దక్కించుకుంది.
ఎన్‌టీపీసీ:- టల్చల్‌లోని 1320 మెగావాట్ల ప్లాంట్‌ విస్తరణకు రూ.9,785 కోట్లు ఖర్చు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐసీఐసీఐ:- సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త దీపక్ కొచర్‌లను ప్రశ్నించేందుకు సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
థైట్రోకేర్ టెక్నాలజీస్:- రూ.66 కోట్ల బైబ్యాక్‌  ఇష్యూను ప్రకటించింది.  
మణిప్పురం ఫైనాన్స్‌:- క్వాంటమ్‌ సెక్యూరీటీస్‌ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 12న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
రైట్స్‌:- రైల్వే మంత్రిత్వశాఖ నుంచి రూ.300 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
సైయంట్‌:- ఆస్ట్రేలియాలోని తనమ అనుబంధ సంస్థలో 86శాతం వాటాను కొనుగోలు చేసింది.
రియలన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ జీనియస్‌ కలర్స్‌లో 16శాతం వాటాను రూ.35కోట్లకు కొనుగోలు చేసింది.
గోవా కార్బన్‌:- ఆగస్ట్‌లో 13,730.8 మెగా టన్నుల ఉత్పత్తిని చేయగా, 14,726.8మెగా టన్నులను విక్రయించినట్లు తెలిపింది.
సిండికేట్‌ బ్యాంకు:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు సెప్టెంబర్‌ 10నుంచి అమల్లోకి రానున్నాయి.
టాటా కమ్యూనికేషన్స్‌:- సైబర్‌ డిఫెన్స్‌ విభాగానికి సంబంధించి మధ్య ప్రాచ్చ దేశాల్లో బలపడేందుకు దుబాయ్‌లో సైబర్‌ సెక్యూరిటీస్‌ రెస్పాండ్ సెంటర్‌ను ప్రారంభించింది.
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను 0.5శాతం పెంచింది.
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీ  5.29శాతం వాటాను కొనుగోలు చేసింది.
మహానగర్‌ గ్యాస్‌:- సెప్టెంబర్‌ 17న కంపెనీ సాధారణ వార్షిక సమావేశం నిర్వహించనుంది.
షికాల్‌ లాజిస్టిక్స్‌:- ఫ్రిఫరెన్షియల్‌ బేసిస్ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా:- నిమయ నిబంధలను ఉల్లంఘించినందకు ఆర్‌బీఐ ఈ మూడు బ్యాంకులపై రూ.1.కోటిల జరిమానాను విధించింది.
క్వాలీటీ:- సెప్టెంబర్‌ 14న కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలియజేసింది.You may be interested

72.50 దిశగా రూపీ పతనం

Monday 10th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.50 దిశగా పతనమౌతోంది. సోమవారం నెగటివ్‌గా ప్రారంభమైన రూపాయికి పోనుపోను మరింత నష్టపోయింది. ఇంట్రాడేలో ఉదయం 10:35 సమయంలో 72.41 ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పతమైంది. డాలర్‌కు బలమైన డిమాండ్‌, అధిక క్రూడ్‌ ధరల కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు నాలుగు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.16

నష్టాలతో బోణి

Monday 10th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,389 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో 38,348 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,589 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో 11,570 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, చైనా దిగుమతులపై అదనంగా 267

Most from this category