News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 5th November 2018
Markets_main1541393989.png-21706

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జీడిమెట్లలో ఉన్న ముడి ఔషధాల (యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌-ఏపీఐ) తయారీ యూనిట్‌ విక్రయ ప్రక్రియను పూర్తి చేసింది.
స్టెరైడ్‌ ఫార్మా సైన్స్‌:- ఇటీవల బెంగళూర్‌లో యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ప్లాంట్‌కు ‘‘జీరో’’ అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు కంపెనీల స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌:- ఆర్థిక మంత్రిత్వశాఖ డిసెంబర్‌ 15న నాటికి రూ.54వేల మూలధన నిధుల్ని జారీ చేయడానికి సిద్ధమైనట్లు వార్త కథనాలు వెలువడ్డాయి.
టీమ్‌లీజ్‌:- అవంతిస్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌లో వ్యూహాత్మక వాటా కొనుగోలు సిద్ధమైంది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌:- కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి ముకుంద్‌ సర్ఫే రాజీనామా చేశారు.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- ఎండీ&సీఈవోగా ఆర్‌కే గుప్తా తిరిగి నియమితులయ్యారు. మరో​ఐదేళ్ల వరకు ఆయన కంపెనీకి తన సేవలను అందించనున్నారు.
యాక్సిస్‌ బ్యాంక్‌:- ఈ డిసెంబర్‌ 20 నాటికి సంస్థ డిప్యూటీ మేనిజింగ్‌ డైరెక్టర్‌ వి. శ్రీనివాసన్‌ పదవికాలం ముగియనుంది. బ్యాంక్‌ ఎండీ&సీఈవో పదవి అమిత్‌ ఛౌదరిని బోర్డు నియమించింది. వచ్చే​ ఏడాది జనవరి 1నుంచి ఛౌదరి తన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
లార్సస్‌ ల్యాబ్స్‌:- ఇటీవల ఏపీలోని యూనిట్‌-6లో తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ప్లాంట్‌కు ఒక అబ్జర్వేషన్‌ను జారీ చేసినట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
కేఈసీ ఇంటర్నేషనల్‌:- తన అనుబంధ సంస్థను అదానీ ట్రాన్స్‌మిషన్స్‌కు రూ.227.5 కోట్లకు విక్రయించేందుకు బోర్డు నుంచి అనుమతులు పొందింది.
ఓరియంటల్‌ కార్బన్‌&కెమికల్స్‌:- కంపెనీ రూ.35కోట్ల విలువైన బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ  2.96శాతం వాటాకు సమానమైన  3.40లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లను నుంచి తిరిగి చేయనుంది.
ఫోర్జ్‌ మోటర్స్‌:- అక్టోబర్‌లో 2,202 యూనిట్ల విక్రయాలను జరిపింది. అదే నెలలో 77 యూనిట్లను ఎగుమతి చేసింది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిప్లా, గెయిల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, నాట్కో ఫార్మా, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అతుల్‌ ఆటో, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, బాష్‌, సెంచురీ ప్లేబోర్డ్‌, గుడ్‌ ఇయర్‌ ఇండియా, ఐనాక్స్‌ విండ్‌, ఎన్‌డీటీవీ, వెంకీస్‌ ఇండియా, ఆజ్మీరా రియల్టీ, సద్భవన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ, ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌ ఇండియా, భాష్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వెంకీస్‌ ఇండియా, తాన్లా కెమికల్స్‌, ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌, మిండా ఇండస్ట్రీస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, శివమ్‌ అటోటెక్‌, షికాల్‌ లాజిస్టిక్‌.You may be interested

అమెరికా మార్కెట్‌ నుంచి అరబిందో ఔషధం వెనక్కి

Monday 5th November 2018

హైదరాబాద్‌: అధిక రక్తపోటు చికిత్సలో వినియోగించే ఇర్బెసర్టాన్‌ అనే ఔషధ ముడి పదార్థాన్ని అమెరికా మార్కెట్‌ నుంచి అరబిందో ఫార్మా స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంది. 22 బ్యాచ్‌ల ఔషధాల్లో కేన్సర్‌ హానికారకం ఉండడంతో ఉపసంహరించుకున్నట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది. కొన్ని రకాల ఆహారం, తాగే నీరు, వాయు కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల్లో ఉండే ఎన్‌-నైట్రోసోడిథలమైన్‌ (ఎన్‌డీఈఏ) అనే మలినం మనుషుల్లో కేన్సర్‌కు దారితీయవచ్చని ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌ ప్రకటించినట్టు

త్వరలో టీసీఐఎల్‌ ఐపీవో

Monday 5th November 2018

న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి ఇంజనీరింగ్‌ అండ్‌ కన్సల్టెన్సీ సేవలు అందించే ‘టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌)’లో 25 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో ఐపీవో ఉండొచ్చని ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. నాలుగు ప్రభుత్వరంగ సంస్థలను లిస్ట్‌ చేయడంతోపాటు, టీసీఐఎల్‌ ఐపీవోకు సంబంధించి పని ఆరంభమైనట్టు చెప్పారు. ‘‘టీసీఐఎల్‌ ఐపీవోను ప్రస్తుత

Most from this category