STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd November 2018
Markets_main1541134988.png-21650

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
టీసీఎస్‌:- లండన్‌కు చెందిన వీ12 స్టూడియో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.
కోల్‌ ఇండియా:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో వాటా విక్రయ ప్రక్రియ గురువారం పూర్తి చేసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5300 కోట్లను సమీకరించింది.
ఐనాక్స్‌ లైస్యూర్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.241.71 చొప్పున మొత్తం 64లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లకు జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రముఖ రేటింగ్‌ కేర్‌ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన రూ.17,655 కోట్ల విలువైన ఎన్‌సీడీల రేటింగ్‌ పునరుద్ధరించింది.
ఆర్తి ఎంటర్‌ప్రైజెస్‌:- వివిధ పద్ధతుల్లో రూ.750కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎస్సాల్‌ ప్రోప్యాక్‌:- సంస్థ ఛీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ మోకాషీ నియమితులయ్యారు.
త్రివేణీ టర్బైన్‌:- రూ.100 కోట్ల బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.150 చొప్పున మొత్తం 66లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.
నెట్‌వర్క్‌ 18:- కంపెనీ తన 13 సంస్థలను విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌:- కంపెనీ తన 4 సంస్థలను విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  
అటో రంగషేర్లు:- పలు అటో కంపెనీలు అక్టోబర్‌ నెల వాహన విక్రయాల గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో నేడు అటో రంగ షేర్ల ట్రేడింగ్‌ చరుగ్గా ఉంటుంది.  

నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- యాక్సిస్‌ బ్యాంక్‌, పంజాబ్‌నేషనల్‌బ్యాంక్‌, హిందాల్కో ఇండస్టీస్‌, ఐఓసీ, భారత్‌ ఫోర్జ్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌టీపీసీ, అలహాదాబాద్‌ బ్యాంక్‌, ఆర్తి డగ్స్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, టీవీస్‌ ఎలక్ట్రానిక్స్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రోడెక్ట్స్‌, మాగ్మా ఫిన్‌ కార్ప్‌, స్పైస్‌ మొబిలిటీ, బాటా ఇండియా, అటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఓరాకిల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సాఫ్ట్‌వేర్‌, ప్రతాప్‌ స్నాక్స్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, గ్లోబస్‌ ఫుడ్స్‌, సెయిల్‌, సన్‌టీవీనెట్‌వర్క్స్‌, ఫ్యూచర్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మాక్స్‌ ఇండియా, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అల్కేమ్‌ ల్యాబ్స్‌, కామత్‌ హోటల్స్‌, ఆదిత్యా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, వీ-మార్ట్‌ రిటైల్‌, కాయా, టాటా కెమికల్స్‌, ఖాదీం ఇండియా, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సెల్యూషన్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, పురవంక, బీఎస్‌ఈ, రిలయన్స్‌ నావెల్స్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌, రిలయన్స్‌ పవర్‌, సిటి యూనియన్‌ బ్యాంక్‌, ఫైన్‌ ఆర్గానిక్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కం‍పెనీ, ఈకేసీ ఇంటర్నేషనల్‌, వీ2 రీటైల్‌, ఈక్విటస్‌ హోల్డింగ్స్‌, ముక్తా ఆర్ట్స్‌, జిల్లెట్‌ ఇండియా, కేర్‌ రేటింగ్స్‌You may be interested

మార్కెట్‌కు ‘ట్రంప్‌ ట్వీట్‌’ జోష్‌

Friday 2nd November 2018

- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌ - వాణిజ్య అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ట్వీట్‌ - 2 శాతం మేర లాభపడిన ఆసియా మార్కెట్లు - ఒకటిన్నర శాతం లాభాల్లో దేశీ సూచీలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ట్వీట్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను రంకెలు వేయించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడానని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్న అనంతరం మార్కెట్లలో

35 పైసలు పుంజుకున్న రూపాయి

Friday 2nd November 2018

డాలరుతో 73.10 వద్ద ప్రారంభం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం 35 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 73.10 దగ్గర ప్రారంభమయ్యింది. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి విలువ పుంజుకుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు వివరించారు. ఇదే సమయంలో దేశీ మార్కెట్‌లు భారీ లాభాల్లో ప్రారంభం కావడం కూడా

Most from this category