STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th December 2018
Markets_main1545797082.png-23230

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వేదాంత లిమిటెడ్‌:- జార్ఖండ్‌లో కొత్త యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమైనట్లు కంపెనీ తెలిపింది. సుమారు 3-4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌కు ఏడాదికి 3-4 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే ప్లాంట్‌ ద్వారా ప్రత్యక్షంగానీ, పరోక్షంగా 1.20లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు.  
నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌:- రూ.1044  కోట్ల రుణాన్ని పొందేందుకు ఎస్‌బీఐతో రూపీ లోన్‌ ఒప్పందం పత్రంపై సంతకాన్ని చేసింది.
హేస్టర్‌ బయోసైన్సెస్‌:- కంపెనీ ధీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సదుపాయాలకు రేటింగ్‌ను సవరించింది.
అదానీ ట్రాన్స్‌మిషన్స్‌:- పీఎఫ్‌సీ కన్సల్టింగ్‌ లిమిటెడ్‌ నుంచి ఓబ్రా-సీ బధన్‌ ట్రాన్స్‌మిషన్స్‌ లిమిటెకు చెందిన 100శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కనస్ట్రక‌్షన్స్‌:- కంపెనీ ఛైర్మన్‌గా రామ్‌చంద్‌ కరుణాకర్‌ రాజీనామా చేశారు.
సియట్‌:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ఇటీవల కంపెనీ జారీ చేసిన రూ.350 కోట్ల విలువైన కమర్షియల్‌ బాండ్ల ఇష్యూకు ఎ1(+)రేటింగ్‌ను కేటాయించింది.
ఐయాన్‌ ఎక్చ్సేంజ్‌(ఇండియా):- కంపెనీ పేరును ఐయాన్‌ ఎక్చ్సేంజ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌గా మార్చివేసింది.
అటోలైన్‌ ఇండస్ట్రీస్‌:- పూణేలో భూముల, భవంతులతో పాటు విలువైన ఆస్తులను అమ్మడానికి పోద్ధార్‌ హాబిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
జేకే సిమెంట్స్‌:- క్యూఐపీ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
టాటా కాఫీ:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా చాస్కో పుర్కాల్‌ థామస్‌ నియమితులయ్యారు.
అపెక్స్‌ క్యాపిటల్‌ అండ్‌ ఫైనాన్స్‌:- ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో నాన్‌ ప్రమోటర్లు, ప్రమోటర్లకు ఈక్విటీ షేర్లకు జారీ చేసేందుకు షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
కామ్లిన్‌ ఫైన్స్‌ సైన్సెస్‌:- ముంబైలోని తారాపూర్‌ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని కంపెనీ తెలిపింది.
ప్రతిభా ఇండస్ట్రీస్‌:- కంపెనీ డైరెక్టర్‌ పదవికి శరత్‌ దేశ్‌పాండేని నియమించారు.
గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌:- ఇటీవల కంపెనీలో విలీనం చేసుకున్న వారాసోప్‌ కంపెనిలో షేర్‌ హోల్డర్ల వాటాను నిర్ణయించడానికి జనవరి 07ను రికార్డు తేదిగా నిర్ణయించింది.You may be interested

10,600 దిగువకు నిఫ్టీ

Wednesday 26th December 2018

సెన్సెక్స్‌ 280 పాయింట్లు డౌన్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,663 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,470 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల నష్టంతో 35,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచేకొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 280 పాయింట్ల

మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 26th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ.. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 35 పాయింట్ల నష్టంతో 3,015 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌

Most from this category