STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 14th February 2019
Markets_main1550121896.png-24186

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
యూనిటెడ్‌ బేవరీజెస్‌:-
కోర్టు అనుమతితో ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ యూనిటెడ్‌ బేవరీజెస్‌ భాగస్వామ్య సం‍స్థ హీనెకెన్ ఎన్వి ఆస్తులను వేలంవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 
జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌:- గోల్డ్‌మెన్‌ శాచ్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌కు కేటాయింపుతో పాటు టార్గెట్‌ ధరను రూ.315లకు పెంచింది. గత 6నెలలు 20శాతం దిద్దుబాటుకు గురైన షేరు వాల్యూవేషన్‌ ఆల్‌టైం కనిష్టానికి చేరుకుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.
ఇండిగో:- విమాన పైలెట్ల కొరత వల్ల మార్చి 30వతేదీ వరకు రోజుకు 30 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. 12 ఏళ్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్రలో ఇలా పెద్దసంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయడం ప్రథమం. ఫిబ్రవరి13న 49 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి చెప్పారు. 
జీ న్యూస్‌:- ఐఎఫ్‌సీఐ మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ సంస్థ జీ న్యూస్‌కి చెందిన ప్రతి షేరు ధర రూ.14.07ల చొప్పున 30లక్షల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేర్లను విక్రయించాయి.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- కంపెనీ డెరెక్టర్‌ పదవికి హర్షిల్‌ మెహతా రాజీనామా చేశారు. అయితే రిటైల్‌ వ్యాపార రంగ విభాగపు ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిసింది.  
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
అశోక్‌ లేలాండ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, నెస్లే ఇండియా, ఓల్టాస్‌, జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, జీవీకే పవర్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, బీజీఆర్‌ ఎనర్జీ, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, గ్లాక్సో స్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌కేర్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, కావేరి సీడ్‌, లా ఓపాలా ఆర్‌జీ, లిబర్టీ షూస్‌, మార్గ్‌, మెక్‌లాయిడ్‌ రస్సెల్‌, మిధాని, పేజ్‌  ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, సద్భావ్‌ ఇంజినీరింగ్‌, తారా జ్యువెల్స్‌, యూనిటెక్‌, వీనస్‌ రెమిడీస్‌, వీడియోకాన్‌, విజయ్‌ టెక్స్‌టైల్స్‌, వివిమెడ్‌ ల్యాబ్స్‌, 7సీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌, ఐఎఫ్‌సీఐ, పాణ్యం సిమెంట్‌.You may be interested

అపోలో మ్యూనిక్‌లో ప్రమోటర్ల వాటా విక్రయం..

Thursday 14th February 2019

41 శాతం వాటాలకు రూ.1,200 కోట్లకు డీల్‌? నాలుగు సంస్థలతో చర్చలు ఆరు నెలల్లోగా డీల్ పూర్తయ్యే అవకాశాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారం తగ్గించుకునే దిశగా ఆరోగ్య బీమా సేవలందించే జాయింట్ వెంచర్ సంస్థ అపోలో మ్యూనిక్ హెల్త్‌లో వాటాలను విక్రయించడంపై అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్స్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 41 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని సుమారు రూ.

ఆర్‌బీఐ క్లీన్‌చిట్‌: యస్‌ బ్యాంక్‌ 29శాతం అప్‌

Thursday 14th February 2019

ఎన్‌పీఏల అంశంలో కేంద్ర రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి క్లీన్‌చిట్‌ రావడంతో యస్‌బ్యాంక్‌ షేర్లు గురువారం బీఎస్‌ఈలో 10శాతం లాభంతో రూ.రూ.185.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 2015-16 కాలంలో ఎన్‌పీఏల నిర్దారణ, ప్రొవిజనింగ్‌ అంశాల విషయంలో దర్యాప్తు చేసిన ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. ఇటీవల రాణాకపూర్‌ వ్యవహారంతో పాటు ఎన్‌పీఏల నిర్దారణ నిర్దారణ తదితర ప్రతికూలాంశాలతో భారీ నష్టపోయిన షేరు తక్కువ ధరకే లభిస్తుండంతో ఇన్వెస్టర్లు నేడు

Most from this category