STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 15th November 2018
Markets_main1542256922.png-22014

వివిధ వార్తల్లోని అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి...
ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- మహారాష్ట్రలోని తలోజా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ జీరో అ‍బ్జర్వేషన్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. తలోజా యూనిట్‌లో ఈ సెప్టెంబర్‌ 15-18తేదిలో యూఎస్‌ఎఫ్‌డీ తనిఖీలు నిర్వహించింది.
పీసీ జ్యుయెలర్‌:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికరలాభం 38శాతం క్షీణించింది. ఈ క్యూ2లో నికరలాభం రూ.94కోట్లను నమోదు చేయగా, గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.154కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
యస్‌ బ్యాంక్‌:- బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు.
అపోలో హాస్పిటల్స్‌:- తన ఫార్మసీ రిటైల్‌ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది
కాఫీ​డే:- కాఫీ, నాన్‌-కాఫీ​ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించింది.
ఆయిల్‌ ఇండియా:- నవంబర్‌ 19న షేరు జరిగే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ ఇష్యూతోపాటు దేశీయ, ఓవర్సీస్‌ మార్కెట్లలో డెబిట్‌ సెక్యూరిటీస్‌ జారీ ఇష్యూకు ఆమోదం తెలపనుంది.

ఐసీఐసీఐ:- రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లపై బ్యాంకు 25 బేసిస్‌ పాయింట్లను పెంచింది. పెరిగిన వడ్డీరేట్ల నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎన్‌హెచ్‌పీసీ:- రూ.600 కోట్ల బైబ్యాక్‌ ఇష్యూకు కంపెనీ ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.28ల వద్ద మొత్తం 21.4 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది.
ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- బినానీ సిమెంట్‌ విషయమై ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ దాఖలు చేసిన సవరణ బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదం తెలిపింది.

యస్‌ బ్యాంక్‌:- వలేచా ఇంజనీరింగ్స్‌కు చెందిన 29.10లక్షల ఈక్విటీ షేర్లకు సమానమైన 13శాతం వాటాను కొనుగోలు చేసింది.



You may be interested

ఈ నెల 28 వరకూ నాల్కో షేర్ల బైబ్యాక్‌

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) రూ.505 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఈ నెల 13న ఆరంభమైన ఈ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 28న ముగుస్తుందని నాల్కో తెలిపింది. గత నెల 12న జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశంలో ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు  ఆమోదం లభించిందని తెలియజేసింది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 6.73 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.75 ధరకు

లాభాల్లో రూపీ

Thursday 15th November 2018

ఇండియన్‌ రూపాయి వరుసగా మూడో సెషన్‌లోనూ బలపడింది. క్రూడ్‌ ధరల తగ్గుదల, ఆసియా కరెన్సీలు లాభపడటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 0.38 శాతం పెరుగుదలతో 72.06 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 72.31గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం 72.06 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.732 శాతంగా

Most from this category