STOCKS

News


గురువారం వార్త‌ల్లోని షేర్లు

Thursday 25th April 2019
Markets_main1556155755.png-25337

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు

ఇండియాబుల్స్  హౌసింగ్ ఫైనాన్స్:- మార్చి త్రైమాసికంలో నిక‌రలాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి.

ఎస్‌బీఐ:-  ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో డాల‌ర్ల నోట్ల రూపంలో 2.5 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది.

అటోమోటివ్ స్ట‌పింగ్స్‌:- క్యూ2లో నిక‌ర న‌ష్టం త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ మార్చి త్రైమాసికంలో 3.82 కోట్ల నిక‌ర‌న‌ష్టాన్ని ప్ర‌క‌టించింది. గ‌తేడాది ఇదే క్యూ4లో 9.1 కోట్ల నిక‌ర న‌ష్టంగా న‌మోదైంది. ఆదాయం పెరిగింది. గ‌త క్యూ4లో ఆదాయం 111.9కోట్లుగా న‌మోదు కాగా, క్వార్ట‌ర్‌లో 139 కోట్లుగా న‌మోదైంది. 

షా ఫుడ్స్ :- బ్రిటానియా కంపెనీ నుంచి కాంటాక్టు బేసిస్ ప‌ద్ధ‌తిలో జాబ్ వ‌ర్క్ కాంటాక్టు ద‌క్కించుకుంది. 

ప్రసిస్టెంట్ సిస్ట‌మ్స్:- కంపెనీ అధ్యక్షుడిగా సందీప్ క‌ర్లే నియమితుల‌య్యారు. 

ఎల్ అండ్ టీ:- ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ.1500 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసింది. 
టాటా ఎలాక్సి:- కంపెనీ నూత‌న సీఈవో, ఎండీగా మ‌నోజ్ రాఘవ‌న్‌ను ఎంపిక చేసింది.
ఓరియంట‌ల్ బ్యాంక్‌:- డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా ఏప్రిల్ 25న నిధుల స‌మీక‌ర‌ణ చేయ‌నుంది. 

నేడు క్యూ4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే కొన్ని కంపెనీలు:- మారుతీసుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బ‌యోకాన్‌, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆదిత్యా బిర్లా మ‌నీ, సైయంట్‌, జీహెచ్‌సీఎల్‌, ఇండియాబుల్స్ వెంచ‌ర్‌, ఎంసీఎక్స్‌, నెస్లే ఇండియా, ఏఏఆర్ క‌మ‌ర్షియ‌ల్ కంపెనీ, అపోటెక్స్ ఇండ‌స్ట్రీస్‌, బేట‌లా గ్గోబల్ సెక్యూరిటీస్‌, కొచ్చిన్ మ‌ల‌బార్ ఎస్టేట్స్‌, లాయిడ్స్ మెట‌ల్ అండ్ ఎన‌ర్జీ, ఓరియంట‌ల్ హోట‌ల్స్‌, పీహెచ్ క్యాపిట‌ల్‌, రాలీస్ ఇండియా, స్టెర్లింగ్ గ్యారెంటీ అండ్ ఫైనాన్స్‌. 



You may be interested

రీట్‌ కిందకు 35 బిలియన్‌ డాలర్ల కార్యాలయ స్థలాలు

Thursday 25th April 2019

జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల (రీట్‌) కింద భవిష్యత్తులో అన్ని రకాల వాణిజ్య ఆస్తులు లిస్టింగ్‌కు వచ్చే వీలుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. భారత్‌లో ప్రస్తుతం 35 బిలియన్‌ డాలర్ల విలువైన కార్యాలయ స్థలాలు రీట్‌ కింద లిస్టింగ్‌కు అర్హత కలిగినవని ఈ సంస్థ తాజాగా ఒక నివేదికలో తెలిపింది. అద్దెలొచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను రీట్‌ కలిగి ఉంటుంది.

రూ.1200కోట్లకు ‘ఆన్‌లైన్‌ మాట్రిమోనీ’

Thursday 25th April 2019

వీడియో మాట్రిమోనీని ఆరంభించిన ‘దిల్‌కే రిస్తే’   హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ వచ్చే ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుతుందని ‘దిల్‌కే రిస్తే’ వ్యవస్థాపకుడు సురేశ్‌ నాయర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి వీడియో మాట్రిమోనీ సైట్‌ ‘దిల్‌కేరిస్తే డాట్‌కామ్‌’ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ‘‘ ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ విలువ రూ.1,000 కోట్లని, ఇందులో దాదాపు 80 శాతం వాటా టాప్‌ 3 సైట్లదేనని (భారత్‌ మాట్రిమోని,

Most from this category