STOCKS

News


ఓవర్‌బాట్‌లోకి పోతున్నాం... జాగ్రత్త!

Friday 13th July 2018
Markets_main1531472286.png-18281

నిపుణుల హెచ్చరిక
దేశీయ సూచీలు వర్ధమాన దేశాల సూచీలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాయి. అయితే అంతర్జాతీయంగా లిక్విడిటీ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో సూచీల పరుగుపై అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో పాటు అప్రమత్తతకు సంకేతంగా భావించే మరికొన్ని సంకేతాలను కూడా చూపుతున్నారు...
- ప్రస్తుతం 200 డీఎంఏకు పైన ట్రేడయ్యే స్టాక్స్‌ శాతం ఓవర్‌బాట్‌ రీజియన్‌లోకి ప్రవేశిస్తోంది. సెన్సెక్స్‌లో దాదాపు 55 శాతం వాటాకు సమానమైన షేర్లు ప్రస్తుతం 200 రోజుల డీఎంఏకు పైన ట్రేడవుతున్నాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియా తర్వాత భారత మార్కెట్లోనే ఇంత శాతం షేర్లు ఓవర్‌బాట్‌ దిశగా పయనిస్తున్నాయని గణాంకాలు చూపుతున్నాయి. 
- కీలక ఇండికేటర్‌ ఆర్‌ఎస్‌ఐ అంత సానుకూల సంకేతాలు చూపడంలేదు. ప్రస్తుతం 14 రోజుల ఆర్‌ఎస్‌ఐ 70కిపైన ఉంది. ఇది ఓవర్‌బాట్‌కు నిదర్శనం. 
- ప్రస్తుతం సెన్సెక్స్‌లో 16 శాతం వాటాకు సమానమైన షేర్ల ఆర్‌ఎస్‌ఐ 70కి పైన ఉంది. ఇది వర్ధమానదేశాలన్నింటిలో అధికం. 
- దేశీయంగా మూ‍్యచువల్‌ఫండ్స్‌ నుంచి నిధుల వరద కొనసాగుతుండడంతో లిక్విడిటీ సమస్య రావడంలేదు. ఈ ఏడాది ఇంత వరకు ఎంఎఫ్‌లు దాదాపు 70 వేల కోట్ల రూపాయలను ఈక్విటీల్లో కుమ్మరించాయి. ఇదే సమయంలో ఎఫ్‌పీఐలు కేవలం 7వేల కోట్ల రూపాయల అమ్మకాలు చేశాయి. ఎంఎఫ్‌లు అమ్మకాలు ఆరంభిస్తే కరెక‌్షన్‌కు గేట్లు ఎత్తినట్లవుతుంది. 
- ప్రస్తుతం వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ప్రదర్శన నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. ఇది ప్రస్తుతం టాప్‌కు చేరిందని కొందరు అనలిస్టులు భావిస్తున్నారు. అందువల్ల సూచీలు కొంత మేర సర్దుబాటు చేసుకునే పరిస్థితులున్నాయని వారు అంచనా వేస్తున్నారు. 
- మరోపక్క సూచీలు పరుగులు కొనసాగుతున్నా.. అడ్వాన్స్‌, డిక్లైన్‌ నిష్పత్తి మాత్రం క్రమంగా కరుగుతూ వస్తోంది. 
- ఎక్కువగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో క్షీణత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హైకి కేవలం 1.4 శాతం దూరంలో ఉండగా స్మాల్‌క్యాప్‌ సూచీ 23 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 15 శాతం దిగువన ఉన్నాయి. 
- వాల్యూషన్ల పరంగా నిఫ్టీ తన పదేళ్ల సరాసరి కన్నా 18 శాతం ప్రీమియంలో ట్రేడవుతోంది. 
ఇవన్నీ గమనించిన అంతర్జాతీయ మదుపరులు క్రమంగా దేశీయ సూచీల్లో తమ ఎక్స్‌పోజర్స్‌ను తగ్గించుకుంటున్నారు. అందువల్ల రిటైల్‌మదుపరులు ఇకమీదట ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పతనం

Friday 13th July 2018

 గత వరుస ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ (పీఎస్‌యూ) షేర్లు  నాటి ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఆ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.65శాతం నష్టపోయింది. నేడు ఈ సూచిలోని ఒక్క ఐడీబీఐ బ్యాంకు షేరు తప్ప, మిగతా అన్ని షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా కెనరా బ్యాంకు 4శాతం నష్టపోగా,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాదాబాద్‌ బ్యాంకు,

ఫార్మా క్యూ1 లాభాల్లో 50 శాతం వృద్ధి..!

Friday 13th July 2018

ముంబై: జూన్‌ త్రైమాసికంలో ఫార్మా రంగ కంపెనీల నికర లాభాలు 50 శాతం వరకు వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ రంగంలో ధరల ఒత్తిడి కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. నియంత్రణా పరమైన వాతావరణం సానుకూలంగా మారుతుండడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనత కారణంగా లాభాలలో వృద్ధికి ఆస్కారం మెండుగా ఉందని భావిస్తున్నాయి. ఫార్మా రంగ ఆదాయం తొలి త్రైమాసికంలో 17 శాతం వరకు

Most from this category