STOCKS

News


నెల రోజులకోసం టాప్‌ సిఫార్సులు

Tuesday 19th March 2019
Markets_main1552977865.png-24684

వచ్చే నెల రోజుల్లో దాదాపు 13 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. మిడ్‌టర్మ్‌లో నిఫ్టీ 12400 పాయింట్లను చేరవచ్చని అంచనా వేసింది. 
1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 96. స్టాప్‌లాస్‌ రూ. 81. బుల్లిష్‌ సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి రెండు వారాల క్రితం పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. దీంతో షేరులో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని నిర్ధారణ వచ్చింది. గత ఐదు సెషన్లుగా స్టాకు కన్సాలిడేషన్‌లో ఉంది. కీలక ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.
2. ఐఓసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 185. స్టాప్‌లాస్‌ రూ. 150. పతాక ఆకార పాటర్న్‌ నుంచి డైలీ చార్టుల్లో బ్రేకవుట్‌ సాధించింది. స్టాకు ఎప్పటికప్పుడు హయ్యర్‌హై, హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. ప్రస్తుతం కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బుల్లిష్‌గా కనిపిస్తోంది.
3. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 231. అధోముఖ వాలు నిరోధ రేఖను పైవైపుగా ఛేదించినట్లు వీక్లీ చార్టులు స్పష్టం చేస్తున్నాయి. ఇది మిడ్‌టర్మ్‌ ట్రెండ్‌ రివర్సల్‌కు సంకేతం. దీంతో ఆరు నెలల కన్సాలిడేషన్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. డైలీ ఆసిలేటర్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి.  



You may be interested

ఫేమ్ పథకం అమలుకు ప్రత్యేక కమిటీ

Tuesday 19th March 2019

- భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటు న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌-2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్‌..

మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత

Tuesday 19th March 2019

- ఫిబ్రవరిలో 8 శాతం పైగా కట్‌ న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం

Most from this category