STOCKS

News


చిన్న స్టాకులను ఎన్నుకోవడం ఎలా?!

Monday 3rd September 2018
Markets_main1535968901.png-19921

స్టాక్‌ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్‌ నుంచి బడా ఇన్వెస్టర్‌ వరకు స్మాల్‌, పెన్నీ స్టాక్స్‌పై మక్కువ చూపుతుంటారు. తక్కువ రాబడికి ఎక్కువ లాభాలనిస్తాయని ఎక్కువమంది చిన్న స్టాకులపై కన్నేస్తుంటారు. అయితే ప్రతి చిన్న స్టాక్‌ ఆశించిన రాబడినివ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన చిన్న స్టాకులను ఎంచుకునేందుకు కొన్ని సూత్రాలను సూచిస్తున్నారు.
- కొత్త రంగంలో నాణ్యమైన కంపెనీలు: సింఫనీ, లాఒపాలా, సెరా లాంటి కంపెనీలన్నీ ఒకప్పుడు వాటి రంగాల్లో కొత్తగా వచ్చిన కంపెనీలే. అయితే అవి నేడు బడా దిగ్గజాలుగా మారాయి. ఎప్పుడైన ఒక కొత్త రంగంలో తక్కువ పెట్టుబడి, సరైన వ్యూహంతో ఉన్న కంపెనీలు భవిష్యత్‌లో దూసుకుపోయేందుకు ఎక్కువ ఛాన్సులుంటాయి.
- నెగిటివ్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌: కంపెనీ వ్యాపారం ఓపీఎం(అదర్‌ పీపుల్‌ మనీ)పై జరుగుతుంటే దాన్ని మంచి సంకేతంగా భావించవచ్చు.
- ప్రమోటర్‌ మార్పులు: వ్యాపార విస్తృతి చేయలేక చతికిలపడ్డ కంపెనీల్లో ప్రమోటర్లు మారినప్పుడు తిరిగి గాడిన పడే అవకాశాలుంటాయి.
- తలనొప్పులున్నా లాభాలు: ఒక గ్రూప్‌నకు చెందిన కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నా ఒక కంపెనీ మాత్రం లాభాలను నమోదు చేస్తుంటే సదరు కంపెనీ భవిష్యత్‌ చాలా బాగుండబోతుందని అర్దం చేసుకోవచ్చు.
- డీమెర్జర్లు: ఒక్కోసారి ఎఫ్‌పీఐలు నిబంధనల కన్నా ఎక్కువ వాటాలుంటే ఎడాపెడా అమ్మేసుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు స్టాకును ఒడిసిపట్టగలగడం మంచిది.
- లీడర్ల వాటా కొట్టేసే కంపెనీలు: ఒక రంగంలో దిగ్గజ కంపెనీల వాటాలను క్రమంగా తినేస్తూ వచ్చే చిన్న కంపెనీలు త్వరగా ఎదుగుతాయని తెలుసుకోవాలి.
- సరైన మూలధన వ్యయ ప్రణాళికలు: కంపెనీకి బాగా రుణాలున్నా కొత్తగా మూలధన వ్యయం అవసరం లేకుండా జాగ్రత్త వహించే కంపెనీలు క్రమంగా అప్పులు తీర్చి లాభాలబాట పడతాయి. You may be interested

11600 దిగువకు నిఫ్టీ

Monday 3rd September 2018

333 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ముంబై:- మార్కెట్‌ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. ఆగస్ట్‌లో పీఎంఐ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింది. ఫలితంగా చివరి గంటలో నెలకొన్న తీవ్రమైన అమ్మకాలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. ఎఫ్‌ఎంజీసీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో, ఐటీ, ఫార్మా రంగాల్లో నెలకొన్న అ‍మ్మకాలతో సెన్సెక్స్‌ 333 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ

ఆగస్ట్‌లో తయారీ నెమ్మదించింది

Monday 3rd September 2018

భారత్‌ తయారీ రంగం వృద్ధి ఆగస్ట్‌ నెలలో అనూహ్యంగా నెమ్మదించింది. దేశీ డిమాండ్‌ మందగించడం ఇందుకు ప్రధాన కారణం. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఈ విషయాన్ని తెలిపింది. తయారీ, కన్సూమర్‌ స్పెండింగ్‌లో బలమైన వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో దేశ జీడీపీ 8.2 శాతంగా నమోదయ్యింది. ఈ మేర వృద్ధిని కూడా ఎవ్వరూ ఊహించలేదు.   ఆగస్ట్‌లో పీఎంఐ ఇండెక్స్‌ మూడు నెలల

Most from this category