STOCKS

News


మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 26th December 2018
Markets_main1545796255.png-23229

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ.. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 35 పాయింట్ల నష్టంతో 3,015 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 17 పాయింట్ల లాభంతో 9,544 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 7 పాయింట్ల నష్టంతో 2,498 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 33 పాయింట్ల నష్టంతో 2,022 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225.. 86 పాయింట్ల లాభంతో 19,241 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు సోమవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌, డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 2.91 శాతం లేదా 653 పాయిం‍ట్ల నష్టంతో 21,792 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.71 శాతం లేదా 66 పాయింట్ల నష్టంతో 2,351 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.21 శాతం లేదా 140 పాయింట్ల నష్టంతో 6,192 పాయింట్ల వద్ద ముగిసింది. 

♦ అమెరికా-మెక్సికో బార్డర్‌కు నిధుల లభించేంత వరకు ప్రభుత్వ పాక్షిక మూసివేత కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. 

♦  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు సోమవారం 6 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు ఇందుకు కారణం. 

♦ 2018లో ఎన్‌సీఎల్‌టీ దివాలా కేసుల పరిష్కారం ద్వారా రూ.80,000 కోట్లు వసూలయ్యాయి. 2019లో ఈ మొత్తం రూ.లక్ష కోట్లను అధిగమించొచ్చనే అంచనాలున్నాయి. 

♦ ప్రపంచంలో భారత్‌ ఏడో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా అవతరించింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.08 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. జర్మనీ మార్కెట్‌ను వెనక్కు నెట్టింది. ఇక అమెరికా మార్కెట్‌ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 27 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. దీని తర్వాతి స్థానంలో చైనా, జపాన్‌, హాంగ్‌కాంగ్‌, యూకే, ఫ్రాన్స్‌, భారత్‌ ఉన్నాయి. 

♦ ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యకాలంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.280 కోట్లను వెనక్కు తీసుకున్నారు. 

♦ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ఐపీవోకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సెబీకి ఐపీవో పత్రాలు అందించింది. 

♦ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ఉద్దంతంలో ఆడిటర్ల పాత్రపై సెబీ దర్యాప్తు చేయనుందని సమాచారం. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వేదాంత లిమిటెడ్‌:- జార్ఖండ్‌లో కొత్త యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమైనట్లు కంపెనీ తెలిపింది. సుమారు 3-4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌కు ఏడాదికి 3-4 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే ప్లాంట్‌ ద్వారా ప్రత్యక్షంగానీ, పరోక్షంగా 1.20లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు.   నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌:-

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు డౌన్‌..

Wednesday 26th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల లాభంతో 10,620 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

Most from this category