STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 23rd October 2018
Markets_main1540266411.png-21371

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిస్తే.. మిగిలిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం లేదా 126 పాయిం‍ట్ల నష్టంతో 25,317 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.43 శాతం లేదా 11 పాయింటు నష్టంతో 2,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.26 శాతం లేదా 20 పాయింట్ల లాభంతో 7,468 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ స్టాక్స్‌ లాభపడటంతో ఎస్‌అండ్‌పీ 500 నష్టాలు తగ్గాయి. అదేసమయంలో నాస్‌డాక్‌ పెరిగింది. అయితే ఫైనాన్షియల్‌ (మరీ ముఖ్యంగా పెద్ద బ్యాంకుల షేర్లు నష్టపోవడం), ఎనర్జీ స్టాక్స్‌ నష్టపోవడం వల్ల డౌజోన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ఈ వారంలో వెలువడనున్న కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్‌ ఇష్యూ, ఇటలీ బడ్జెట్‌, సౌదీ అరేబియా సంబంధిత అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 

♦ అమెరికా మార్కెట్ల ప్రభావం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. నికాయ్‌, హాంగ్‌సెంగ్‌, కొస్పి ఇండెక్స్లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 494 పాయింట్ల నష్టంతో 22,120 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల నష్టంతో 3,051 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 137 పాయిం‍ట్ల నష్టంతో 9,837 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 24 పాయింట్ల నష్టంతో 2,631 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 46 పాయింట్ల నష్టంతో 2,115 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 482 పాయింట్ల నష్టంతో 25,670 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గ్యాప్‌డౌన్‌ను సూచిస్తోంది.

♦ క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగానే ఉన్నాయి. ఎనర్జీ మార్కెట్‌లో బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తామని సౌదీ అరేబియా ప్రకటించడం ఇందుకు కారణం. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండటంతో మార్కెట్‌లో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 79.87 డాలర్లుగా ఉంది. ఇక అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 69.41 డాలర్లుగా ఉంది. 

♦ రూపాయి సోమవారం నష్టపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 24 పైసలు క్షీణించి 73.56 వద్ద ముగిసింది. 

♦ దాదాపు 43 కంపెనీలు మంగళవారం క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్స్‌, బజాజ్‌ కార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంసీఎక్స్‌ ఇండియా, రాలీస్‌ ఇండియా, టాటా మెటాలిక్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌, జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.   

♦ దేశీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ మూడవ వారం నాటికి మొత్తం వసూళ్లు రూ.4.89 లక్షల కోట్లగా నమోదయ్యాయి. 

♦ దొడ్ల డెయిరీ కంపెనీ ఐపీవోకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ఐపీఓతో పాటు మరో మూడు కంపెనీలు- ఆఫిల్‌ ఇండియా, చాలెట్‌ హోటల్స్‌, హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓలకు కూడా పచ్చజెండా ఊపింది. 

♦ బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌:- భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి రూ.366.36 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్స్‌ కార్పోరేషన్‌:- కంపెనీ ప్రస్తుత పేరును ఆర్‌ఈసీ లిమిటెడ్‌గా మార్చుకునేందుకు మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేషన్‌ అఫైర్స్‌ శాఖ అనుమతినిచ్చింది. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌:- పలు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రపంచస్థాయి కంపెనీ ‘‘అవుట్‌ సిస్టమ్స్‌’’తో జట్టు కట్టనుంది. సైయంట్‌:- కంపెనీ స్వతంత్ర్య డైరెక్టర్‌గా వికాస్‌

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 23rd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో ఏకంగా 111 పాయింట్ల నష్టంతో 10,141 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,231 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే

Most from this category