STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 21st September 2018
Markets_main1537501835.png-20418

నిఫ్టీ ఇండెక్స్‌ వరుసగా మూడో సెషన్‌లో క్షీణిస్తూ వస్తూ బుధవారం 11,250 కీలక మద్దతు స్థాయి దిగువకు పడిపోయింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా బేర్‌ గుప్పిట్లోనే ఉంది. దాదాపు ఒక శాతంమేర క్షీణించింది. ఇక ఐటీ, మెటల్‌ మినహా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. 
నిఫ్టీ-50 గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. 11,300 మార్క్‌కుపైకి కదిలింది. ఇంట్రాడేలో 11,332 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే చివరి రెండు గంటల్లో లాభాలు ఆవిరై 11,210 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 44 పాయింట్ల నష్టంతో 11,234 వద్ద ముగిసింది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,186, 11,137 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,307, 11,380 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 164 పాయింట్ల నష్టంతో 26,277 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 26,138, 25,998 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 26,514, 26,750 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌, ఎస్‌అండ్‌పీ 500 కొత్త గరిష్ట స్థాయిలో క్లోజయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ కూడా లాభాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 251 పాయిం‍ట్ల లాభంతో 26,656 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 22 పాయింట్ల లాభంతో 2,930 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 78 పాయింట్ల లాభంతో 8,028 పాయింట్ల వద్ద క్లోజయింది. వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నా కూడా డాలర్‌ బలహీనపడటం, దేశ ఆర్థిక పరిస్థితులు బాగుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. 
♦ ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 118 పాయింట్ల లాభంతో 23,793 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల లాభంతో 2,330 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 177 పాయింట్ల లాభంతో 27,654 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 23 పాయింట్ల లాభంతో 3,203 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 73 పాయిం‍ట్ల లాభంతో 10,904 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 2,726 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ డిన్యూక్లియరైజేషన్‌ వేగవంతం కోసం ఉత్తర కొరియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మరోమారు చర్చలను ఆహ్వానిస్తోందని దక్షిణ కొరియా పేర్కొంది. 
♦ క్రూడ్‌ ధరలు శుక్రవారం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ధరలను తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వారం అల్జీరియాలో జరగనున్న సమావేశంలో ఈ అంశంపై ఒత్తిడి తీసుకురానున్నారు. 
♦ ఇండియన్‌ ఆర్థిక వ్యవస్థ 2022 నాటి కల్లా 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరొచ్చని ప్రధాని మోదీ అంచనా వేశారు. 
♦ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 61 పైసలు బలపడింది. 72.37 వద్ద ముగిసింది. బ్యాంకులు డాలర్లను ఎక్కువగా విక్రయించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీన పడటం కలిసొచ్చాయి.
♦ ఆగస్ట్‌లో పీఈ ఇన్వెస్ట్‌మెంట్లు 1.33 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు పీఈ ఇన్వెస్ట్‌మెంట్లు 12.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని గ్రాంట్‌ థార్న్‌టాన్‌ తెలిపింది. 
♦ అక్టోబర్‌ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌ ప్రారంభం కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెబీ అనుమతినిచ్చింది. 
♦ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ ఐపీవో ద్వారా రూ.1,734 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. టీ అండ్‌ టీ ఇన్‌ఫ్రా కూడా ఐపీవోకు రానుంది. 
♦ స్మాల్‌ సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేట్లను పెంచింది. You may be interested

యస్‌ బ్యాంక్‌ 30 శాతం క్రాష్‌

Friday 21st September 2018

యస్‌ బ్యాంక్‌ శుక్రవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో నిలువునా పతనమైంది. ఆ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవిలో కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతి నిరాకరించడంతో ఈ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 20శాతం పతనమైన రూ.250 వద్ద పతనమైంది. కొద్ది నిమిషాల్లోనే ఇది 30శాతం వరకు పడిపోయి రూ.218 కనిష్టస్థాయిని తాకింది. ఉదయం 9:20ని.లకు 22శాతం క్షీణతతో రూ.247ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 21st September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:39 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,359 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,273 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 86 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా

Most from this category