STOCKS

News


35,605పైన స్థిరపడితే అప్‌ట్రెండ్‌

Monday 19th November 2018
Markets_main1542604160.png-22161

క్రూడ్‌ ధర అనూహ్య పతనం, రూపాయి పెరుగుదల కారణంగా భారత్‌ ఆర్థిక ఫండమెంటల్స్‌ మెరుగుపడినట్లే. వరుసగా రెండు నెలలపాటు భారీ విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ బిలియన్‌ డాలర్ల మేర నికర కొనుగోళ్లు జరపడం కూడా ఇండియాపట్ల వారి దృక్పథంలో వచ్చిన మార్పుకు సూచన.  ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణిస్తుందన్న అంచనాల వల్ల  ఫెడ్‌ వడ్డీ రేట్ల భవిష్యత్తు పెంపుపై... ఇద్దరు ఫెడ్‌కమిటీ సభ్యులు సందేహం వ్యక్తం చేయడం కూడా ఇండియావంటి వర్థమాన దేశానికి అనుకూలాంశం. అయితే మరో మూడు వారాల్లో కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  ఈ నేపథ్యంలో మన మార్కెట్‌ గరిష్టస్థాయిలో స్థిరపడలాంటే విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ సరళి ముఖ్యం. ఇక ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
నవంబర్‌ 16తో ముగిసిన వారం ప్రధమార్థంలో 34,672 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ద్వితీయార్థంలో 35,545 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. ఈ క్రమంలో 200 రోజుల చలన రేఖ కదులుతున్న 35,406 పాయింట్ల ఎగువన 35,457 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 299 పాయింట్ల మేర లాభపడింది. అక్టోబర్‌ 17నాటి గరిష్టస్థాయి అయిన 35,605 పాయింట్ల స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు కీలకం. ఈ స్థాయిపైన వేగంగా 35820-35,920 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 36,050-36,250 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చు. ఈ వారం  35,605 పాయింట్ల స్థాయిపైన సెన్సెక్స్‌ స్థిరపడలేకపోతే 35,320 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 35,110 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 34,670 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. 

10,710పైన అప్‌ట్రెండ్‌

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం తొలుత 10,440 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గి,  వారాంతంలో 10,695 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 97 పాయింట్ల లాభంతో 10,682 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి గత అక్టోబర్‌ 17నాటి గరిష్టస్థాయి అయిన 10,710 పాయింట్ల స్థాయి సమీప భవిష్యత్తులో కీలకం. సెన్సెక్స్‌ ఇప్పటికే 200 డీఎంఏను అధిగమించగా, నిఫ్టీ ఇంకా ఆ ఫీట్‌ను సాధించాల్సివుంది. 10,710 పాయింట్లపైన వేగంగా 200 డీఎంఏ కదులుతున్న 10,756 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఈ స్థాయిని దాటితే 10,840 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన క్రమేపీ కొద్దిరోజుల్లో 11,000 పాయింట్ల స్థాయిని చేరే ఛాన్సుంది. ఈ వారం తొలి అవరోధస్థాయిపైన స్థిరపడలేకపోతే 10,630 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతుస్థాయిని కోల్పోతే 10,555 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని వదులుకుంటే తిరిగి 10,440 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.



You may be interested

ఆర్‌బీఐ vs కేంద్రం

Monday 19th November 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర

స్థిరంగా పసిడి ధర

Monday 19th November 2018

డాలర్‌ బలహీనతతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.00డాలర్లు స్వల్పంగా నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ అధికారులు ప్రపంచ ఆర్థిక వృద్ధి మం‍దగమనంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు వర్గాలు  వచ్చే డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు

Most from this category