STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా?

Thursday 20th December 2018
Markets_main1545277331.png-23087

గురువారం స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది. 

♦ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో రేట్ల శ్రేణి 2.25- 2.5 శాతానికి చేరింది. 2019లో రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని పేర్కొంది. 

♦ అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2019లో 2.3 శాతం మేర పెరగొచ్చని ఫెడ్‌ అంచనా వేసింది. మునపటి అంచనా 2.5 శాతంతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. ఇకపోత ద్రవ్యోల్బణం 2 శాతం అంచనాలకు దిగువునే ఉండొచ్చని పేర్కొంది.

♦ క్రూడ్‌ ఆయిల్‌ ధర బుధవారం పెరిగింది. రిఫైన్డ్‌ ప్రొడక్టులకు బలమైన డిమాండ్‌ ఉన్నట్లు అమెరికా గణాంకాలు పేర్కొనడం ఇందుకు కారణం. అయితే సెంటిమెంట్‌ మాత్రం నెగటివ్‌గానే ఉంది. ఓవర్‌సప్లై, బలహీన డిమాండ్‌ వంటి అంశాలపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు.  బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 57.24 డాలర్ల వద్ద, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 47.20 డాలర్ల వద్ద కదలాడుతోంది. 

♦ ఇండియన్‌ రూపాయి బుధవారం 5 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.39 వద్ద ముగిసింది. 

♦ సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఐపీఓ మార్కెట్‌ డల్‌గానే ఉంటుందని కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ తెలిపింది. 

♦ సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 3 పాయింట్ల లాభంతో 3,062 పాయింట్ల వద్ద ఉంది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 55 పాయింట్ల నష్టంతో 9,728 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 10 పాయింట్ల నష్టంతో 2,539 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 14 పాయింట్ల నష్టంతో 2,064 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 141 పాయింట్ల నష్టంతో 25,724 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఏకంగా 356 పాయింట్ల నష్టంతో 20,631 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు బుధవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా.. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.49 శాతం లేదా 352 పాయిం‍ట్ల నష్టంతో 23,323 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.54 శాతం లేదా 39 పాయింట్ల నష్టంతో 2,506 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.17 శాతం లేదా 147 పాయింట్ల నష్టంతో 6,636 పాయింట్ల వద్ద ముగిసింది. 2019లో వడీ రేట్ల పెంపు ఉంటుందని, అయితే తక్కువగా ఉంటుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వు అంచనా వేసింది. దీంతో సరళ విధాన పాలసీలను ఆశించిన ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.  



You may be interested

మార్కెట్‌ స్పీడ్‌కు ఫెడ్‌ బ్రేకులు..

Thursday 20th December 2018

10,900 దిగువున నిఫ్టీ.. 80 పాయింట్లు డౌన్‌ సెన్సెక్స్‌ 160 పాయింట్లకు పైగా క్షీణత అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గరువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,967 పాయింట్లతో పోలిస్తే 82 పాయింట్ల నష్టంతో 10,885 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,484 పాయింట్లతో పోలిస్తే 163 పాయింట్ల నష్టంతో 36,321 పాయింట్ల వద్ద

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం..

Thursday 20th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,986 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

Most from this category