STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 21st November 2018
Markets_main1542772075.png-22236

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 15 పాయింట్ల నష్టంతో 10,654 పాయింట్ల వద్ద ఉంది. 

♦ మంగళవారం 6 శాతానికిపైగా పతనమైన క్రూడ్‌ ధరలు బుధవారం నిలకడగా ఉన్నాయి. అమెరికాలో క్రూడ్‌ నిల్వలు అనూహ్యంగా తగ్గాయనే వార్తాలు బలం చేకూర్చాయి. రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఆయిల్‌ మార్కెట్‌లో అస్థిరతలు ఉండొచ్చని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ.. ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 53.57 డాలర్ల వద్ద ఉంది. 

♦ భారత్‌ జీడీపీ వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్‌ కాలంలో 7.2 శాతానికి తగ్గొచ్చని ఇక్రా అంచనా వేసింది. 

♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి వరుసగా ఆరవ సెషన్‌లోనూ పెరిగింది. నవంబర్‌ 20న 21 పైసలు లాభంతో 71.46 వద్ద ముగిసింది. 

♦ బిట్‌కాయిన్‌ ధర ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. 4,300 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఈ వారంలో ఏకంగా 25 శాతం పతనమైంది.  

♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని (రూ.80,000 కోట్లు)  చేరుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తంచేసింది.

♦ జిర్కాన్‌ టెక్‌ ఐపీవోకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ అనుమతినిచ్చింది. 

♦ అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజూ మంగళవారం కూడా బాగా పడిపోయాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా క్షీణిస్తే.. డౌజోన్స్‌ 2 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.21 శాతం లేదా 551 పాయిం‍ట్ల నష్టంతో 24,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.82 శాతం లేదా 49 పాయింట్ల నష్టంతో 2,641 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.7 శాతం లేదా 120 పాయింట్ల నష్టంతో 6,909 పాయింట్ల వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు 6 శాతం మేర పతనం కావడంతో ఎనర్జీ షేర్లు పడిపోవడం ఇండెక్స్‌లపై ప్రతికూల ప్రభావం చూపింది. పలు కంపెనీలు బలహీనమైన ఎర్నింగ్స్‌ను ప్రకటించడం, ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు వంటి పలు అంశాలు మార్కెట్లను దెబ్బతీశాయి. నాస్‌డాక్‌ ఏడు నెలల కనిష్ట స్థాయిలో ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు అక్టోబర్‌ నుంచి చూస్తే కనిష్ట స్థాయిల్లో ఉన్నాయి.  

♦ అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మాత్రం కేవలం 2 పాయింట్ల లాభంతో 3,029 పాయింట్ల వద్ద ఉంది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 9,699 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల నష్టంతో 2,635 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 14 పాయింట్ల నష్టంతో 2,068 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 29 పాయింట్ల నష్టంతో 25,811 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 136 పాయింట్ల నష్టంతో 21,447 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 



You may be interested

లాభాలు.. అంతలోనే నష్టాలు..

Wednesday 21st November 2018

10,670 వద్ద నిఫ్టీ ప్రారంభం సెన్సెక్స్‌ 18 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,656 పాయింట్లతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో 10,670 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,474 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 35,492 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,336

నిఫ్టీ ఓపెనింగ్‌ ఎలా ఉండొచ్చు?

Wednesday 21st November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 15 పాయింట్ల నష్టంతో 10,654 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,671 పాయింట్లతో పోలిస్తే 17 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Most from this category