STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 10th October 2018
Markets_main1539142555.png-20989

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 56 పాయిం‍ట్ల నష్టంతో 26,430 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 4 పాయింట్ల నష్టంతో 2,880 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 7,738 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 62 పాయింట్ల నష్టంతో 23,407 పాయింట్ల వద్ద,  హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 75 పాయింట్ల లాభంతో 26,247 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 16 పాయింట్ల నష్టంతో 3,150 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 11 పాయిం‍ట్ల లాభంతో 10,466 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 7 పాయింట్ల నష్టంతో 2,714 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 22 పాయింట్ల నష్టంతో 2,232 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.

♦ నవంబర్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో మరోమారు భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. 

♦ కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌లోకి విదేశీ సంస్థలు అడుగు పెట్టేందుకు సెబీ అనుమతినిచ్చింది. 

♦ రూపాయి మంగళవారం రికార్డ్‌ కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 33 పైసలు క్షీణించి 74.39 వద్ద ముగిసింది. 

♦ ఐఎంఎఫ్‌ ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించడంతో క్రూడ్‌ ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 84.98 డాలర్ల వద్ద ఉంది. ఇక అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 74.8 డాలర్లుగా ఉంది. 

♦ లిక్విడిటీ సమస్య పరిష్కారంలో భాగంగా ఆర్‌బీఐ అక్టోబర్‌ 11న  రూ.12,000 కోట్ల విలువైన గవర్నమెంట్‌ బాండ్లను కొనుగోలు చేయనుంది. 

♦ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2 ఎర్నింగ్స్‌ ఫలితాలను అక్టోబర్‌ 11న వెల్లడించనుంది. 

♦ చైనాపై ఆధారపడ్డటాన్ని తగ్గించుకునేందుకు దేశంలోనే ఏపీఐ తయారీని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. 

నిఫ్టీ మంగళవారం 47 పాయింట్ల నష్టంతో 10,301 వద్ద ముగిసింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 10,254, 10,207 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 10,372, 10,444 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 24,527 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 24,408, 24,289 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 24,703, 24,879 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
ఇండియా వీఐఎక్స్‌ 1.93 శాతం తగ్గుదలతో 19.75కి క్షీణించింది. మొత్తంగా చూస్తే వీఐఎక్స్‌ గరిష్ట స్థాయిల్లోనే ఉండటం వల్ల మార్కెట్‌లో బేర్‌ ఆధిపత్యం ఉంటుంది. 



You may be interested

లాభాల బోణి

Wednesday 10th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,299 పాయింట్లతో పోలిస్తే 194 పాయింట్ల లాభంతో 34,493 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,301 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, నవంబర్‌లో ఎన్నికలు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 10th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 18 పాయింట్ల లాభంతో 10,329 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,314 పాయింట్లతో పోలిస్తే 15 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా

Most from this category