STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 12th September 2018
Markets_main1536724526.png-20175

మంగళవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది.  నష్టాల్లోకి జారిపోయింది. 11,300 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం, వాణిజ్య ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి. 
ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి కనిపిస్తోంది.
11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 11,479 పాయింట్లను తాకింది. అయితే తర్వాత 11,300 మార్క్‌ దిగువకు వచ్చేసింది. ఇంట్రాడేలో 11,274 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 150 పాయింట్ల నష్టంతో 11,287 వద్ద ముగిసింది.   
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,214, 11,141 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,419, 11,552 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
బ్యాంక్‌ నిఫ్టీ 394 పాయింట్ల నష్టంతో 26,807 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 26,613, 26,419 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,159, 27,512 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 114 పాయిం‍ట్ల లాభంతో 25,971 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 11 పాయింట్ల లాభంతో 2,887 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 48 పాయింట్ల లాభంతో 7,972 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ షేర్లు 2 శాతానికిపైగా పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 93 పాయింట్ల నష్టంతో 22,571 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,277 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 118 పాయింట్ల నష్టంతో 26,304 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు నష్టంతో 3,109 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 36 పాయిం‍ట్ల నష్టంతో 10,716 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం రికార్డ్‌ కనిష్ట స్థాయి 72.69 వద్ద ముగిసింది. 
♦అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. ఇరాన్‌పై ఆంక్షలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. 
♦ఆర్‌బీఐ జూలైలో 1.87 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. 
♦అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగితే చైనా 7 లక్షల ఉద్యోగాల కోల్పోవలసి వస్తుందని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. 
♦చైనా కంపెనీలు అమెరికా టారిఫ్‌లను తప్పించుకోవడానికి చైనా నుంచి ఇతర దేశాలను కార్యకలాపాలను మళ్లీస్తున్నాయి. 
♦బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు (ఎన్‌పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. 
♦డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం వల్ల రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్‌’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 



You may be interested

లాభాలతో ఆరంభం

Wednesday 12th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,413 పాయింట్లతో పోలిస్తే 133 పాయింట్ల లాభంతో 37,546 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,287 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 11,340 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి.  అమెరికా మార్కెట్లు

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 12th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9:03 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 11,329 పాయింట్ల వద్ద ఉంది. దీంతో నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి.   ఆసియా మార్కెట్లు నష్టాల్లో.. ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌

Most from this category