STOCKS

News


మార్కెట్‌ పడుతుందా? పెరుగుతుందా?

Tuesday 11th September 2018
Markets_main1536637884.png-20137

సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే నష్టాలను కొనసాగించింది. 11,500 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలుకావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచింది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,385, 11,333 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,531, 11,625 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
బ్యాంక్‌ నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 27,201 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,094, 26,987 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,356, 27,511 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 59 పాయిం‍ట్ల నష్టంతో 25,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500 కేవలం 5 పాయింట్ల లాభంతో 2,877 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 22 పాయింట్ల లాభంతో 7,924 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ స్టాక్‌ క్షీణత వల్ల నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ లాభాలు తగ్గాయి. 
♦ ఒక్క జపాన్‌ ఇండెక్స్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 222 పాయింట్ల లాభంతో 22,595 పాయింట్ల వద్ద ఉంది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,282 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 43 పాయింట్ల నష్టంతో 26,570 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 12 పాయింట్ల నష్టంతో 3,109 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల నష్టంతో 2,661 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 33 పాయిం‍ట్ల నష్టంతో 10,692 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦అమెరికా తమ ప్రొడక్టులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తే.. ప్రతిగా మేం కూడా అదే విధానాన్ని అవలంబించాల్సి వస్తుందని చైనా పేర్కొంది. కాగా చైనా దిగుమతులపై అదనంగా 267 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమౌతున్నారు.
♦ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌తో మరోమారు భేటీ కావాలని కోరుకుంటున్నారు. ఇదే అంశమై ఉత్తర కొరియా.. అమెరికాకు ఒక లేఖ కూడా పంపింది. 
♦అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.45 రికార్డ్‌ స్థాయి వద్ద ముగిసింది. 
♦క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగా కొనసాగుతున్నాయి.
♦రూపాయి విలువ వచ్చే ఏడాది మార్చి నాటికి 73కు పతనం కావొచ్చని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ పేర్కొంది. ద్రవ్యలోటు లక్ష్యం కట్టు తపొచ్చని అంచనా వేసింది.
♦పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గరిష్ట స్థాయిలకు చేరడంతో ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకాలను తగ్గిస్తున్నాయి. 
♦ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో భారత్‌ జీడీపీ వృద్ధి నెమ్మదించొచ్చని యూబీఎస్‌ పేర్కొంది. 
♦ఆసియా-పసిఫిక్‌ ప్రాంత జీడీపీలో ఇండియా జీడీపీ వాటా 2000లో 17.3 శాతానికి పెరిగిందని ఏడీబీ తెలిపింది. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 11th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌:- నేడు 1:1 నిష్పత్తిలో షేర్ల విభజన కానున్నాయి. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌:- తొలి త్రైమాసికంలో రూ.40 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో సాధించిన రూ.38 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 41శాతం అధికం. ఆదాయం గత క్యూ1లో రూ.383 కోట్లు నమోదు కాగా, ఈ క్యూ1లో 404 కోట్లను సాధించింది. సన్‌ ఫార్మా:- ఇజ్రాయెల్‌కు చెందిన టార్సియెస్‌

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 11th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:53 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,473 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,492 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు జపాన్‌ ఇండెక్స్‌ మినహా మిగతా

Most from this category