STOCKS

News


మార్కెట్‌పై వీటి ప్రభావం

Thursday 27th September 2018
Markets_main1538019543.png-20610

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 106 పాయింట్ల (0.4 శాతం) క్షీణతతో 26,385 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్ల (0.33 శాతం) నష్టంతో 2,905 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 17 పాయింట్ల (0.21 శాతం) నష్టంతో 7,990 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఎంత కాలం రేట్లను పెంచుకుంటూ వెళ్తోందనన్న భయాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకోడానికి మొగ్గుచూపడం స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో లాభాల్లో ఉన్న మార్కెట్లు చివరకు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కాగా ఫెడ్‌ వడ్డీ రేట్లను పావు శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్‌ వడ్డీ రేట్ల శ్రేణి 2-2.25 శాతానికి పెరిగింది.  
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 32 పాయింట్ల నష్టంతో 24,002 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 27 పాయిం‍ట్ల లాభంతో 11,001 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,260 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 2 పాయింట్ల నష్టంతో 2,805 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 8 పాయింట్ల నష్టంతో 27,809 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 14 పాయింట్ల లాభంతో 2,353 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.    
♦ఫెడ్‌ రేటు పెంపు వల్ల అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గాయి.
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను  సూచిస్తోంది.
♦అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లపాటు మంచి వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. డిసెంబర్‌లో కూడా రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది. అలాగే వచ్చే ఏడాది మూడు సార్లు, అటుపై ఏడాది ఒకసారి రేట్ల పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. 
♦క్రూడ్‌ ధరలు గురువారం ఒక శాతంమేర పెరిగాయి. ఆయిల్‌ మార్కెట్‌లో సరఫరా తగ్గడం ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 82.17 డాలర్ల వద్ద ఉంది. 
♦ద్రవ్యోల్బణం అంచనాలకు అనువుగా ఉన్నప్పటికీ, రూపాయికి బలాన్ని చేకూర్చేందుకు ఆర్‌బీఐ రానున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంచుతుందని రాయిటర్స్‌ పేర్కొంది.
♦చైనా నవంబర్‌ 1 నుంచి మెషినరీ, పేపర్‌, టెక్స్‌టైల్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌ మెటీరియల్స్‌ సహా పలు దిగుమతులపై టారిఫ్‌లను తగ్గించనుంది.
♦కేంద్ర ప్రభుత్వం దాదాపు 19 ప్రొడక్టులపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచడం వల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు పెరగనున్నాయి. 



You may be interested

లాభాల స్టార్ట్‌

Thursday 27th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,542 పాయింట్లతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 36,691 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,053 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 11,079 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఎంత కాలం రేట్లను పెంచుకుంటూ వెళ్తోందనన్న భయాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకోడానికి మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్లు బుధవారం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి

Thursday 27th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 33 పాయింట్ల లాభంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,062 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా

Most from this category