STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Thursday 22nd November 2018
Markets_main1542858453.png-22276

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల నష్టంతో 10,616 పాయింట్ల వద్ద ఉంది. 

♦ప్రపంచ ఆర్థిక వృద్ధి ‘బలహీనత’ దిశగా పయనిస్తోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల వ్యవస్థ దిశగా పయనం వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగమనంలోకి లాగుతున్నాయని పేర్కొంది. 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.7 శాతం ఉంటుందని గతంలో ఓఈసీడీ అంచనావేసింది. అయితే అయితే ఈ అంచనాను 3.5 శాతానికి తగ్గిస్తున్నాం. 2020లో కూడా ఇదే వృద్ధి రేటు నమోదుకావచ్చు. 

♦ప్రయాణికుల వాహన విక్రయ అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రీసెర్చ్‌ తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన(పీవీ) విక్రయాలు 9-11 శాతం రేంజ్‌లో వృద్ధి చెందుతాయని క్రిసిల్‌ గతంలో అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7-9 శాతానికి తగ్గించింది. డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటం, పండుగల సీజన్‌లో కూడా నిల్వలు అధికంగా ఉండటం దీనికి కారణాలని వివరించింది.

♦క్రూడ్‌ ధరలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అమెరికాలో నిల్వలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపితే.. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరాను తగ్గించవచ్చేనే అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 53.71 డాలర్ల వద్ద ఉంది. 

♦స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించిన అమెరికాపై వివిధ దేశాలు చేసిన ఫిర్యాదులను పరిశీలించేందుకు డబ్ల్యూటీవో అంగీకారం తెలిపింది. స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై వివిధ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ విషయమై డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేశాయి. వీటిని సమీక్షించేందుకు డబ్ల్యూటీవో వివాదాల పరిష్కార విభాగం ఒక ప్యానెల్‌ ఏర్పాటుకు అంగీకరించింది. 

♦ఫైనాన్షియల్‌ రంగంలో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

♦అమెరికా మార్కెట్ల వరుస రెండు రోజుల పతనానికి అడ్డు కట్ట పడింది. బుధవారం నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిస్తే, డౌజోన్స్‌ ఫ్లాట్‌గా క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఫ్లాట్‌గా 24,465 పాయింట్ల వద్దే ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.3 శాతం లేదా 8 పాయింట్ల లాభంతో 2,649 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.92 శాతం లేదా 63 పాయింట్ల లాభంతో 6,972 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ, టెక్నాలజీ షేర్లలో రిబౌండ్‌ చోటుచేసుకోవడంతో అమెరికా మార్కెట్‌ ఇండెక్స్‌లు మళ్లీ లాభాలోకి వచ్చాయి. అయితే థాంక్స్‌గివింగ్‌ హాలిడే నేపథ్యంలో యాపిల్‌ షేర్ల లాభాలు హరించుకుపోవడంతో చిరవకు మార్కెట్లు ఫ్లాట్‌గానే ముగిశాయి. 

♦ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ మాత్రం 18 పాయింట్ల లాభంతో 9,759 పాయింట్ల వద్ద ఉంది. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ కేవలం 1 పాయింటు నష్టంతో 3,037 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 6 పాయింట్ల నష్టంతో 2,645 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,070 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 25 పాయింట్ల నష్టంతో 25,945 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 4 పాయింట్ల నష్టంతో 21,504 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్‌ ధరలు మళ్లీ పెరడగం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు కారణంగా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. You may be interested

మార్కెట్‌ ఫ్లాట్‌

Thursday 22nd November 2018

10,612 వద్ద నిఫ్టీ ప్రారంభం సెన్సెక్స్‌ 83 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,600 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో 10,612 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,199 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్ల లాభంతో 35,282 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తాజాగా

నిఫ్టీ ఫ్లాట్‌ ఓపెనింగ్‌??

Thursday 22nd November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల నష్టంతో 10,616 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,621 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

Most from this category